ఉరి వేసుకుని ఆత్మహత్య
పెగడపల్లి అక్టోబర్ 11 పెగడపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన 7 వతరగతి చదువుతున్న రామడుగు శ్రీనిధి పదకొండు సంవత్సరాలు అమ్మాయి మానసిక స్థితి సరిగా లేనందున 06/10/2022 రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోని రేకుల కోసం వేసిన పైపుకు చీరతో ఉరి ఉరివేసుకోగా ముడి సరిగా లేనందున కిందపడింది అదే సమయంలో వారి తల్లి రావడంతో అది చూసి వెంటనే ఆ అమ్మాయిని జగిత్యాలలో ఆస్పత్రికి తరలించారు ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అక్కడి నుండి కరీంనగర్లోని ప్రతిమ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు ఆ అమ్మాయి చికిత్స పొందుతూ మంగళవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు మరణించింది తల్లి అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్వేత తెలిపారు