ఉల్టా చోర్‌! భారతే కవ్వింపు

చర్యలకు పాల్పడుతోంది
పాక్‌ విదేశాంగ మంత్రి హీనా
న్యూయార్క్‌, జనవరి 16:
జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు సైనికులు హతమవ్వడాన్ని ఆసరాగా తీసుకొని భారత్‌ యుద్ధ పిపాసను ప్రదర్శిస్తోందని పాకిస్తాన్‌ ఆరోపించిం ది. పాక్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందన్న ఆరోప ణల్లో వాస్తవం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ తెలిపారు. అలాంటి వాటికి ఆస్కా రం లేదని చెప్పారు. ఆసియా సైసొటీ న్యూయార్క్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హీనా ప్రసంగించారు. ఇంతకు ముందులాగా పాక్‌తో సంబంధాలు కొనసాగవన్న ప్రధాని మన్మోహన్‌ వ్యాఖ్యలు తమను తీవ్ర నిరాశకు గురి చేశాయని పేర్కొన్నారు. యుద్ధ భేరీ మోగించేందుకు భారత్‌ రెచ్చగొడుతున్నట్లుగా ఉందని పేర్కొన్నారు. యుద్ధానికి రెచ్చిగొట్టడం సరికాదని హీనా తెలిపారు. సరిహద్దు వెంబడి భారీగా బలగాలు మోహరించినట్లు చెప్పారు. పాక్‌ సైనికులు ఇద్దరు భారత జవాన్ల తలలను నిర్దాక్షిణ్యంగా నరికారన్న భారత ఆరోపణలపై హీనా స్పందించారు. జవాన్ల తలలు నరకమని ఎవరూ చెప్పరని హీనా తెలిపారు. సరిహద్దు ఘటనపై భారత ఉన్నతాధికారులు చేసిన ప్రకటనలు తమను పూర్తిగా అసంతృప్తికి గురి చేశాయన్నారు. అలాంటి ప్రకటనలు సరికాదని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉత్కంఠ కారణంగా దక్షిణా ఆసియా ప్రాంతం విడిపోదని ఆమె వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య వైరం కారణంగా దక్షిణాసియా ఐక్యతకు వచ్చిన ముప్పేవిూ లేదన్నారు. భారత్‌తో శాంతియుత చర్చలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయన్నారు. ద్వైపాక్షిక ఒప్పందాలు, చర్చలు కొనసాగాలని పాక్‌ ఆకాంక్షిస్తోందని చెప్పారు. భారత్‌ ప్రకటనల పట్ల తాము సంయమనం పాటించామని, మాటల ద్వారా కానీ, చర్యల ద్వారా తాము ప్రతిస్పందించలేదని తెలిపారు. భారత్‌ తాజా యుద్ధ పిపాస, నియంత్రణ రేఖ వద్ద జరిగిన మూడు ఘటనలతో గత 60 ఏళ్ల జ్ఞాపకాలు జ్ఞప్తికి వస్తున్నాయని హీనా వ్యాఖ్యానించారు. మాపై నెపం మోపి, వారు (భారత్‌) యుద్దానికి సన్నద్ధమవుతున్నారని ఆరోపించారు. ఉద్రిక్తత తొలిగి సాధారణ పరిస్థితి నెలకొంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చలతోనే సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు.