‘జీ రామ్‌ జీ’కి లోక్‌సభ ఆమోదం

` ‘ఉపాధి’ స్థానంలో కొత్తబిల్లుకు లోక్‌సభ పచ్చజెండా
` బిల్లు ప్రతులు చించి నిరసన తెలిపిన విపక్షం
` వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన
` పేరు మార్పు దుర్మార్గమని విమర్శలు
` మహాత్ముడిని అవమానించారు
` రాష్ట్రాలపై భారం మోపేలా బిల్లు: ప్రయాంక
గాంధీ ఆశయాలను ముందుకు తీసుకు వెళుతున్నమన్న శివరాజ్‌సింగ్‌
న్యూఢల్లీి,డిసెంబర్‌18(జనంసాక్షి): మహాత్మా గాంధీ జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ చట్టం స్థానంలో ’వీబీ జీ రామ్‌ జీ’ పేరుతో తీసుకువచ్చిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు, నిరసనల మధ్య ఈ బిల్లును ఆమోదించారు. అయితే, బిల్లును స్టాండిరగ్‌ కమిటీకి పంపించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల నిరసనలపై స్పందించిన స్పీకర్‌.. ఓం బిర్లా బిల్లుపై సుధీర్ఘంగా చర్చించారని చెప్పారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకం’ ఎంజీనరేగాను రద్దు చేసి దాని స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ’వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌`గ్రావిూణ్‌’ (వీబీ జీ రామ్‌ జీ) బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తంచేశాయి. వారి ఆందోళన నడుమ స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించగా.. బిల్లు కు ఆమోదం లభించింది. ఈ సమయంలో విపక్ష ఎంపీలు వెల్‌లోకి వచ్చి నిరసన చేపట్టాయి. కొందరు ప్రతిపక్ష నేతలు ’వీబీ జీ రామ్‌ జీ’ బిల్లు ప్రతులను చించి విసిరేశారు. ఈ గందరగోళం నేపథ్యంలో లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడిరది.అంతకుముందు బిల్లు తీరుపట్ల మరింత ఆగ్రహానికి గురైన విపక్ష సభ్యులు.. బిల్లు ప్రతులను చించి పడేశారు. వీరి ఆందోళనల మధ్యే బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ప్రకటించారు. ఇక లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో.. ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, డీఎంకే నాయకులు టీఆర్‌ బాలు, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు ధర్మేంద్ర యాదవ్‌ సహా పలువురు విపక్ష పార్టీల సభ్యులు.. జీ రామ్‌జీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లుకు వ్యతిరేకంగా సభలో ఆందోళన చేపట్టారు. ఈ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడం అంటే జాతిపితను అవమానించడమేనని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లుతో రాష్టాల్రపై మరింత భారం పడుతుందని ఆరోపించారు. మరోవైపు జీ రామ్‌జీ బిల్లును కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సమర్థించారు. బిల్లుపై లోక్‌సభలో మాట్లాడిన శివరాజ్‌ సింగ్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక పథకాలకు నెహ్రూ పేరును పెట్టిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందని విమర్శించారు. ప్రభుత్వానికి పేర్లు మార్చాలనే దురుద్దేశం ఉందంటూ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను సైతం ఆయన ఖండిరచారు. పేర్లు మార్చాలనే ఉద్దేశం కేవలం ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం కేవలం పనిపై మాత్రమే దృష్టి పెడుతోందని చెప్పుకొచ్చారు. అందరితో చర్చించిన తర్వాతే కొత్త చట్టాన్ని తీసుకువచ్చామని కేంద్రమంత్రి ఉద్ఘాటించారు. కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కామెంట్స్‌పై ప్రతిపక్ష సభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ఎంపీలు సభ వెల్‌లోకి ప్రవేశించి.. బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బిల్లు ప్రతులను చించేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా మాట్లాడుతూ.. ’కాగితాలను చించివేయడానికి ప్రజలు మిమ్మల్ని ఇక్కడికి పంపలేదు. దేశం మిమ్మల్ని చూస్తోంది.’ అని విపక్ష సభ్యులను హెచ్చరించారు. అంతకుముందు బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాల ఆరోపణలకు కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ బదులిచ్చారు. మహాత్మాగాంధీ సిద్దాంతాలకు అనుగుణంగానే మోదీ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. బాపూ సిద్దాంతాలను కాంగ్రెస్‌ సర్కారు చంపేసింది. కానీ, ఎన్డీయే ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తోంది. పీఎం ఆవాస్‌ యోజన, ఉజ్వల యోజన, స్వచ్ఛభారత్‌ మిషన్‌, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలతో గాంధీజీ కలలను మేం సాకారం చేస్తున్నాం అని తెలిపారు. ఈ సందర్భంగా గత కాంగ్రెస్‌ పాలనపై ఆయన విరుచుకుపడ్డారు. తొలుత ఉపాధి హావిూ పథకానికిఎన్‌ఆర్‌జిఎ అనే పేరు ఉండేది. ఆ తర్వాత 2009లో లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ పథకానికి మహాత్మాగాంధీ పేరు చేర్చింది. అంతేకాదు.. వారి హయాంలో ఈ పథకం అమలులో అనేక లోటుపాట్లు చోటుచేసుకున్నాయి. కూలీలపై ఎక్కువ ఖర్చు చేసి.. మెటీరియల్‌ కొనుగోలుకు తక్కువ వెచ్చించారని చౌహన్‌ మండిపడ్డారు. పేరు మార్పుపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలను ప్రస్తావిస్తూ.. గతంలోనే అనేక పథకాలకు కాంగ్రెస్‌ గాంధీ`నెహ్రూ పేర్లు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. పల్లె ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, గ్రావిూణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన, వనరుల ఉత్పాదకత, అభివృద్ధి లక్ష్యాలుగా దాదాపు రెండు దశాబ్దాల కిందట ’ఎన్‌ఆర్‌ఈజీఏ’ చట్టాన్ని 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. తర్వాత 2009లో మహాత్మాగాంధీ జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ చట్టంగా పేరు మార్చారు.అనంతరం సభను వాయిదా వేశారు.
రాష్ట్రాలపై భారం మోపేలా బిల్లు: ప్రయాంక
మహాత్మాగాంధీని అవమానించేందుకే కొత్తగా జి రామ్‌ జీ బిల్లును తీసుకుని వచ్చారని కాంగ్రెస్‌ ఎంపి ప్రియాంకగాంధీ ఆరోపించారు. సభ వాయిదా పడిన తరువాత పార్లమెంట్‌ వెలుపల ప్రియాంక గాంధీ వాద్రా విూడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీ రామ్‌జీ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. ’బిల్లులోని వివరాలను చదివిన ఎవరికైనా గ్రావిూణ ఉపాధి హావిూ పథకం ఎలా పూర్తి కాబోతోందో అర్థమవుతుంది. ఈ బిల్లు వలన రాష్టాల్రపై మరింత ఆర్థిక భారం పడనుంది. రాష్టాల్రు ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. నరేగా పథకం పేదలకు అండగా ఉండేది. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు పేదలకు పూర్తి వ్యతిరేకంగా ఉంది.’ అంటూ కేంద్ర ప్రభుత్వం తీరుపై ప్రియాంక తీవ్ర విమర్శలు చేశారు.
సభలో విపక్షం తీరు దారుణం
కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ మాట్లాడుతూ.. లోక్‌సభలో విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బిల్లు కాగితాలను చించివేశారని.. ఇది ఖండిరచాల్సిన అంశమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు చోటు లేదన్నారు. జీ రామ్‌జీ బిల్లుపై సుదీర్ఘంగా చర్చించారని.. అయినప్పటికీ విపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించడం దారుణమన్నారు. ప్రజల ప్రయోజనాల కోసమే ఈ బిల్లును తీసుకురావడం జరిగిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ మాట్లాడుతూ.. లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు ఏమాత్రం ఆమోదనీయం కాదన్నారు. ’విూకు వ్యతిరేకించే హక్కు ఉంది. కానీ, ఈ రకమైన ప్రవర్తన సరికాదు. బిల్లు ప్రతులను చించివేయడం, విమానాలు తయారు చేయడం, స్పీకర్‌పై విసరడం సరికాదు. దేశంలోనే అతిపురాతన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు.. ఇలా ప్రవర్తించడం గర్హనీయం. బిల్లుకు పెట్టిన పేరును విపక్ష సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. కానీ, రాముడి పేరు ఆ మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన పేరు. ఆయన తుదిశ్వాస విడిచే సమయంలోనూ ’హే రామ్‌’ అనే అన్నారు.’ అంటూ కేంద్ర మంత్రి పేర్కొన్నారు.