అమెరికా ఆర్థిక అభివృద్ధికి కారణం సుంకాలే..
` ‘టారీఫ్’ అనే పదమంటేనే నాకెంతో ఇష్టం: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన పదవి కాలంలో మెరుగుపడిన ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు భద్రత, వలస విధానాలు, దేశాలపై టారిఫ్‌లు తదితర అంశాల గురించి ప్రస్తావించారు. భారత్-పాక్ సహా పలు యుద్ధాలు ఆపానంటూ మరోసారి చాటింపు వేసుకున్నారు. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన ప్రతి సైనికుడికి ట్రంప్ 1,776 డాలర్ల నగదు బహుమతి ప్రకటించారు.‘‘10 నెలల్లో ఎనిమిది యుద్ధాలు ఆపా. ఇరాన్ అణుముప్పును అడ్డుకున్నా. గాజా యుద్ధం ఆపి.. పశ్చిమాసియాలో తొలిసారి శాంతిని నెలకొల్పా’’ అని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టారిఫ్‌ల గురించి స్పందిస్తూ.. అమెరికాలో 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించగలిగామని తెలిపారు. సుంకాల కారణంగానే ఇదంతా సాధ్యమైందన్నారు. ‘టారిఫ్’ అనే పదం తనకు చాలా ఇష్టమని, అనేక దశాబ్దాల పాటు ఇతర దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా దీన్ని వినియోగించాయన్నారు. ఇకపై అది కుదరదని వ్యాఖ్యానించారు. అమెరికాలో తయారుచేసే వాటికి సుంకాలు ఉండవనే కారణంతో అనేక కంపెనీలు దేశానికి తిరిగి వస్తున్నాయన్నారు.
మరో 20 దేశాలపై ప్రయాణ నిషేధం
ఇక, క్రిస్మస్ సందర్భంగా ప్రతి అమెరికన్ సైనికుడికి 1,776 డాలర్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. సాయుధ దళాల సేవ, త్యాగాలకు గుర్తుగా.. దీనికి ‘వారియర్ డివిడెండ్’గా పేర్కొన్నారు. 1.45 మిలియన్‌లకు పైగా ఉన్న సైనిక సిబ్బందికి క్రిస్మస్‌కు ముందే దీన్ని అందించనున్నట్లు తెలిపారు.
అక్టోబరు దాకా ఎదురుచూపులే..
` హెచ్-1బీ దరఖాస్తుదారుల కష్టకాలం..
వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీతో భారత హెచ్-1బీ దరఖాస్తుదారులకు కష్టకాలం ఎదురైంది. ఈ విధానం వల్ల వీసా కోసం దరఖాస్తుదారులు వచ్చే ఏడాది అక్టోబరు దాకా ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తింది. చాలామంది దరఖాస్తుదారుల వీసా అపాయింట్‌మెంట్లు 2026 అక్టోబరు నెలాఖరుకు వాయిదా పడినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిరచాయి. డిసెంబరు-జనవరిలో జరగాల్సిన హెచ్-1బీ, హెచ్-4 వీసా ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చికి రీషెడ్యూల్ చేసినట్లు ఇటీవల అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడిరచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. వీరి ఇంటర్వ్యూ తేదీలను ఇప్పుడు అక్టోబరు నెలకు వాయిదా వేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసేందుకు అదనపు సమయం పడుతోందని, అందువల్లే ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారుల పరిస్థితి గందరగోళంలో పడిరది. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు సాధించి.. ప్రయాణాల కోసం టికెట్లు బుక్ చేసుకున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబరు 15వ తేదీ నుంచి హెచ్1బీ, హెచ్4 వీసా దరఖాస్తుదారులకు సోషల్ వెట్టింగ్‌ను అమెరికా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకు వీలుగా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేటు నుంచి పబ్లిక్‌కు మార్చుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అగ్రరాజ్యం తెలిపింది.


