ఎంసెట్‌ ఫలితాలు విడుదల

ఇంజినీరింగ్‌లో 72.67, మెడికల్‌లో 80.79 శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్‌, జూన్‌ 5 (జనంసాక్షి) :
ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎంసెట్‌) పరీక్షా ఫలితాలను బుధవారం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 72.67 శాతం ఉత్తీర్ణత పొందారు. మెడికల్‌ విభాగంలో 80.79 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు డెప్యూటీ సీఎం వెల్లడిరచారు. ఇంజినీరింగ్‌ పరీక్షలకు 2,76,996 మంది విద్యార్థులు హాజరు కాగా, 2,01,308 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. మెడికల్‌ పరీక్షకు 99,983 మంది విద్యార్థులు హాజరు కాగా, 80,778 విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మెడికల్‌ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన వెంకట వినీత్‌కు మొదటి ర్యాంకు, రెండవ ర్యాంకు రోహిత్‌, మూడవ ర్యాంకు జగదీష్‌, 4వ ర్యాంకు వెంకటేశ్‌, 5వ ర్యాంకు రిత్విక్‌లు సాధించారు. ఇంజినీరింగ్‌లో ప్రకాశం జిల్లాకు చెందిన సాయి సందీప్‌రెడ్డి మొదటి ర్యాంకు, రెండవ ర్యాంకు సుజనరాజ్‌, మూడవ ర్యాంకు గోకుల్‌, 4వ ర్యాంకు సాయి కిరణ్‌, వై.జోత్స్న 5వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఈనెల 17వ తేదీన కౌన్సెలింగ్‌ జరుగుతుందని వెల్లడిరచారు.