ఎక్కడా లేనిది ఇక్కడెట్లుంటది?

వ్యాట్‌ రద్దు చేయండి : కేసీఆర్‌ డిమాండ్‌
హైదరాబాద్‌, మార్చి 12 (జనంసాక్షి) ః
రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వేధింపులకు గురిచేస్తుందని టిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద గత మూడురోజులుగా వస్త్రవ్యాపారులు చేస్తున్న ధర్నా శిభిరాన్ని కేసిఆర్‌ సందర్శిం చి వారి ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈసందర్బంగా కేసిఆర్‌ మాట్లాడుతూ మద్యప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం వస్త్ర పరిశ్రమపై పూర్తిగా వ్యాట్‌ను రద్దుచేస్తే ఆంద్రప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యాట్‌ను అమలుచేస్తూ ముక్కుపిండి వసూలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తప్ప ఏరాష్ట్రంలో కూడా వస్త్ర పరిశ్రమపై వ్యాట్‌ అమలు కావడం లేదన్నారు. పూర్తిగా వ్యాపారాన్ని వదులుకుని హైదరాబా ద్‌లో ఆందోళన చేస్తున్న వేలాది మంది వస్త్ర పరిశ్రమ ప్రతినిధుల ఆందోళన హైదరాబాద్‌లో తిరుగుతున్న మంత్రులకు, ముఖ్యమంత్రికి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కనిపించడం లేదా అని కేసిఆర్‌ ప్రశ్నించారు. ముఖ్య మంత్రిపైన ఒత్తిడితెచ్చి సమస్య పరిష్కరించేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని ఆయన కాంగ్రెస్‌ ప్రతి నిధులను నిలదీశారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల అనేక పరిశ్రమలు మూతపడుతున్నా యని, అయినా దున్నపోతుపైన వాన పడ్డట్లుగా కూడా లేదన్నారు. రైతులకు ఏడు గంటలు విద్యుత్‌ సరఫ రా చేయడంలో విఫలం అవుతూనే బిల్లులు మాత్రం సర్‌చార్జ్‌ పేరుతో ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులఉసురు తప్పకుండా కిరణ్‌కుమార్‌రెడ్డికి తగలక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రప్రభు త్వం బేషజాలకుపోకుండా వ్యాట్‌ను వెంటనే రద్దుచేయాలని, లేనిపక్షంలో టిఆర్‌ఎస్‌ పక్షాన ప్రత్యక్ష ఆందో ళనకు దిగుతామని హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. తాము పెట్టే అవిశ్వాసంలో రైతుల సమస్యలతోపాటు వస్త్రవ్యాపారుల సమస్యలు కూడా ఉంటాయన్నారు. ప్రజాస్వామ్యంలో వివిద రకాల ప్రజలను, వ్యాపారులను వేధించడం పాలకులకు తగదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తగ్గించక పోయి నా త్వరలోనే తెలంగాణా రాష్ట్రం రావడం ఖాయమని, ఆతర్వాత ఏర్పడ్డ ప్రభుత్వంచే పూర్తిగా వ్యాట్‌ను తగ్గిస్తూ జిఓను విడుదల చేస్తామన్నారు. తెలంగాణాలో ఏర్పడే ప్రభుత్వం తొలి జిఓ వ్యాపారుల వ్యాట్‌ రద్దు పైనే ఉంటుందన్నారు. రాబోయే కాలంలో సైతం టిఆర్‌ఎస్‌ వస్త్రవ్యాపారులకు, నేతన్నలకు అండగా ఉంటుందన్నారు. వ్యాపారులు,నేతన్నలు ఏమాత్రంనిరుత్సాహానికి గురికావద్దన్నారు. కుటుంబాలను వదులు కు ని రాష్టాన్న్రి వదిలేసి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లవద్దని కోరారు.
ప్రభుత్వానికి శవ ర్యాలీ నిర్వహించిన వ్యాపారులు
గత నాలుగు రోజులుగా వస్త్ర పరిశ్రమను మొత్తాన్ని మూసివేసి ఆందోళన చేస్తున్నప్పటికి కిరణ్‌ నేతృత్వం లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ వ్యాపారులు ప్రభుత్వ శవ దిష్టిబొమ్మ తో హైదరాబాద్‌లో భారీర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్‌నుంచి ఇందిరాపార్క్‌ వరకు వ్యాట్‌ దిష్టిబొమ్మ ను ఊరేగించి దీక్షాశిభిరంవద్ద తగులపెట్టారు. వ్యాట్‌ను రద్దుచేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట మరిచిపో యిందని ఆరోపించారు. 2012జనవరి 22నుంచి 30వరకు ఆందోళనచేస్తే చర్చలుజరిపిన ప్రభుత్వం వ్యాట్‌ ను రద్దుచేస్తామని హామిఇచ్చిందిని గుర్తుచేశారు. ప్రభుత్వంఇప్పటికైనా వ్యాట్‌ను రద్దుచేయాలని, లేనిపక్షం లో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆందోళనకారులుహెచ్చరించారు.