ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలకు డిప్యుటేషన్లపై ఉపాధ్యాయులను పంపండి : జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను పంపి విద్యాబోధన గావించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో డీఈవో, ఎంఈఓ లతో సమావేశం నిర్వహించి విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలలో ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారని, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండి విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలను గుర్తించి అట్టి ఉపాధ్యాయులను డిప్యూటేషన్లపై పాఠశాలలకు పంపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రెండు రోజులలో అట్టి నివేదికను పంపాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఉన్నత పాఠశాలలో ప్రాథమికోన్నత పాఠశాలల వివరాలను విద్యార్థుల వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. పాఠశాలలకు సక్రమంగా హాజరుకాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డీఈఓ కు ఆదేశించారు. ఈ సమావేశం లో డీఈవో సిరాజుద్దీన్, ఎస్తేర్ రాణి, అన్ని మండలాల ఎంఈఓ లు పాల్గొన్నారు.