ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎంపికకు ఏర్పాట్లు
ఖమ్మం, నవంబర్ 27 : జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఎంపికకు ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు జారీ చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ గంగాధర్ తెలిపారు. జిల్లాలో 127 పోస్టులకు 20,707 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా ఎంపికలో పారదర్శకం చేస్తామన్నారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు పొందవచ్చునన్నారు. డిసెంబర్ 1 నుంచి పందిళ్లపల్లి గ్రామం నుంచి దంసలాపురం మధ్య పరుగు పోటీ ఉంటుందని పురుషులు నాలుగు కిలోమీటర్ల దూరం, మహిళలు రెండు కిలోమీటర్లను 13 నిమిషాల్లో పూర్తి చేయాలని అన్నారు. ఇందులో అర్హత పొందిన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు.