ఎట్టకేలకు శాసనసభ స్థాయి సంఘాల నియామకం

హైదరాబాద్‌ , ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) :
రాష్ట్ర శాసనసభ స్థాయీ సంఘాల చైర్మన్లను నియమిస్తు శాసనసభ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 12 శాసనసభ స్థాయీ సంఘాలకు చైర్మన్లను నియమించారు. ఆత్రం సక్కు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎ నర్సారెడ్డి, సత్త నారాయణ, ఎం విజయప్రతాప్‌, కె యాదవ్‌ రెడ్డి, జీవీ శేషు, బి మస్తాన్‌ రావు, కె సుధాకర్‌, వంగాగీత, ఆర్‌ రెడ్డప్ప , పి కృష్ణ రెడ్డిలు నియమితులయ్యారు. సంక్షేమ స్థాయీ సంఘం చైర్మన్‌గా ఆత్రం సక్కు, శాసనసభ మౌళిక సదుపాయాల ఆభివృద్ది-1 స్థాయీ సంఘం చైర్మన్‌గా ఎర్రబెల్లి దయాకర్‌రావు, మౌళిక సదుపాయాల అభివృద్ది-2 స్థాయీ సంఘం

చైర్మన్‌గా ఎమ్మెల్సి ఎ నర్సారెడ్డి, మానవ వనరుల స్థాయీ సంఘం చైర్మన్‌గా ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, పట్టణాభివృద్ది స్థాయీ సంఘం ఎం విజయప్రసాద్‌, గ్రామీణాభివృద్ది స్థాయీ సంఘం చైర్మన్‌గా ఎమ్మెల్సీ కె యాదవ్‌రెడ్డి, రెవెన్యూ స్థాయీ సంఘం చైర్మన్‌గా జివి శేషు, ఉపాధి కల్పన స్థాయీ సంఘం చైర్మన్‌ బి ముస్తాన్‌రావు, వ్యవసాయ స్థాయీ సంఘం చైర్మన్‌గా కె సుధాకర్‌, వైద్యం స్థాయీ సంఘం చైర్మన్‌గా వంగా గీత, అటవీ, పర్యావరణం స్థాయీ సంఘం చైర్మన్‌గా ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి, నీటిపారుదల శాఖ స్థాయీ సంఘం చైర్మన్‌గా పి కృష్ణారెడ్డిలు నియమితులయ్యారు.