ఎనిమిది మంది బడిబయట పిల్లల పాఠశాలలో చేరిక

ఎస్ వి కే సంస్థ సేవలు మరువలేనివి
పేద విద్యార్థుల కోసం ఎంతో కృషి

లింగాల జనం సాక్షి ప్రతినిధి

శ్రామిక వికాస కేంద్రం సంస్థ సేవలు మరువలేనివని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన్యం అన్నారు శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ బాలురు బాలికల ఉన్నత పాఠశాలలో ఇద్దరు బాలుర స్కూల్లో చేర్పించి, వారికి హాస్టల్లో ఉండేవిధంగా బీసీ హాస్టల్లో చేర్పించడం జరిగింది. వివరాల్లోకి వెళితే లింగాల మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన హరీష్ 8 వ తరగతి. అభిలాష్ ఏడవ తరగతి. లో చేర్పించడం జరిగింది. అదేవిధంగా ఇదే గ్రామానికి చెందిన ఇదే గ్రామానికి చెందిన గుద్ధటి దీపిక గత సంవత్సరం బడి మానివేసి ఖాళీగా ఉండడంతో వారిని కూడా నాగర్కర్నూల్ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు లతా సమక్షంలో 9వ తరగతిలో చేర్పించడం జరిగింది. అనంతరం అట్టి బాలికకు బిసి బాలికల వసతి గృహంలో హాస్టల్ సీటు ఇప్పించడం జరిగింది. ఇలాంటి సేవలు చేస్తున్న శ్రామిక వికాస కేంద్రం సంస్థకు ప్రధానోపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు, అదేవిధంగా బల్మూరు మండలం బాణాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన అజయ్ ఏడవ తరగతి లో, లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామానికి చెందిన ప్రణయ్ 8 వ తరగతి లో, పానగల్లు మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన మణికంఠ ఏడవ తరగతి లో, తెల్ల రాళ్ల పల్లి గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ ఆరవ తరగతిలో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ్ లాలు, సమక్షంలో చేర్పించడం జరిగింది. ఇలాంటి పేద పిల్లలకు ఎంతో శ్రమించి శ్రామిక వికాస కేంద్రం మండల కోఆర్డినేటర్ శ్రీనివాస్ యాదవ్ కృషి చేస్తున్నందుకు తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. అదేవిధంగా లింగాల మండలం దారారం గ్రామానికి చెందిన అనూష ఇటీవల పదవతరగతిలో 8.0 జిపి ఏ సాధించారు. డ్రాప్ అవుట్ కావడంతో వారికి గ్రామ సర్పంచ్ కవిత ఎస్ వి కే మండల కోఆర్డినేటర్ శ్రీనివాసులు, కమ్యూనిటీ ఆర్గనైజర్ మన్సూర్ వారికి వారి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి బల్మూర్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో ఇంటర్లో చేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో
ఈ కార్యక్రమంలో ఎస్ వి కె మండల కోఆర్డినేటర్ శ్రీనివాసులు. గ్రామైక్య సంఘ నాయకులు, పాఠశాల విద్యా కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ. ఎస్వి కమ్యూనిటీ ఆర్గనైజర్ ప్రమీల, అశోక్, తల్లిదండ్రులు కోడెల మల్లయ్య, గుద్ధటి బాలచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.