ఎన్టీపీసీ మూడో యూనిట్లో సాంకేతిక లోపం
కరీంనగర్: రామగుండం ఎన్టీపీసీ మూడో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు 200 మెగావాట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. గత రెండు రోజుల క్రితమే వార్షిక మరమ్మతులు పూర్తి చేసి ఉత్పత్తి దశలోకి ఈ యూనిట్‌ను ప్రవేశపెట్టారు. అయితే జనరేటర్లలో లోపాన్ని గుర్తించి ఉత్పత్తిని ఈ ఉదయం నిలిపివేశారు. దీన్ని సరిచేసేందుకు నిపుణులు చర్యలు చేపట్టారు.