ఎన్డీసీ సమావేశంలో మహిళల రక్షణ అంశం లేవనెత్తిన ప్రధాని

న్యూఢిల్లీ: జాతీయ అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో దేశరాజధానిలో జరుగుతున్న ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమాజంలో మహిళల రక్షణ అంశాన్ని లేవనెత్తారు మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని ఆయన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. జనాభాలో సగభాగమైన మహిళల క్రియాశీల భాగస్వామ్యం లేనిదే ఏ అభివృధ్ధీ సంపూర్ణం కాదని, వారికి రక్షణ కల్పించకపోతే ఈ కీలక భాగస్వామ్యం సాధ్యం కాదని ఆయన వివరించారు. ఢిల్లీ సంఘటనను ఆయన  ఉదహరిస్తూ నేరస్తులను పట్టుకున్నామన్నారు. లైంగిక నేరాలపై ఉన్న చట్టాలకు మరింత పదును పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.