.ఎన్నికలేవైనా జనంసాక్షి చెప్పిందే ఫైనల్‌..


` హుజురాబాద్‌లో సర్వేతో మరోమారు నిరూపించుకున్న జనంసాక్షి
` జనంసాక్షి సెఫాలజీ రాగద్వేషాలకు అతీతం
` నాలుగునెలల క్రితం నుంచే ఈటల గెలుపు ఖాయమని తేల్చేసిన ‘జనంసాక్షి’ సర్వే
జనంనాడి.. జనంసాక్షి / జనం మాటే ‘జనంసాక్షి’ నోట
ఢల్లీి అసెంబ్లీ ఎన్నికల నుండి హుజురాబాద్‌ ఉపఎన్నికల వరకు జనం మాటే ‘జనంసాక్షి’ నోట
ప్రతిష్టాత్మక సంస్థలకు సైతం అందని హుజురాబాద్‌ జనంనాడి
ఈటెలదే గెలుపు అని ముందే చెప్పిన ‘జనంసాక్షి’
వనరులు పరిమితమే అయినప్పటికీ నిశ్పాక్షికతనే ‘జనంసాక్షి’ బలం
హైదరాబాద్‌, నవంబర్‌ 2 (జనంసాక్షి): ఎన్నికల ఫలితాలను ముందే అంచనా వేయడంలో ‘జనంసాక్షి’ తన సామర్థ్యాన్ని, నిబద్ధతను మరోసారి నిరూపించుకుంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ రాజీనామా చేయడంతో జరిగిన హుజురాబాద్‌ ఉపఎన్నికలు దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసినదే. ఈటెల రాజేందర్‌ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన రోజు నుండి ఈరోజు లెక్కింపు పూర్తి అయేవరకు కూడా గెలుపు ఎవరిదనే అంశంలో జనంనాడి తెలియక రాజకీయవర్గాలలో తీవ్ర ఉత్కంఠత నెలకొనివుంది. అలాంటి క్లిష్టమైన నియోజకవర్గంలో ‘జనంసాక్షి’ తనకు ఉన్న పరిమిత వనరులతో ఎన్నికల సర్వే నిర్వహించి ఈటెలదే గెలుపు అని నిష్పక్షపాతంగా ప్రకటించింది. ‘జనంసాక్షి’ అంచనాలను నిజం చేస్తూ టిఆర్‌ఎస్‌ అభ్యర్థిపైన ఈటెల రాజేందర్‌ విజయం సాధించారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఉనికి లేదని ‘జనంసాక్షి’ ఎన్నికల సర్వేలో చెప్పినట్లుగానే డీలాపడిపోయి డిపాజిట్‌ కోల్పోయింది. గత ఢల్లీి అసెంబ్లీ సాధారణ ఎన్నికలతో పాటు తెలంగాణాలో జరిగిన అనేక ఎన్నికల సందర్భాలలో జనంసాక్షి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి నిర్వహించిన సర్వేల ద్వారా జనంనాడి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఓటరు చెప్పబోయే తీర్పును ‘జనంసాక్షి’ ముందే బహిర్గతం చేసింది. వనరులు పరిమితమే అయినప్పటికీ ‘జనంసాక్షి’కి నిశ్పాక్షికతనే బలం, జనంమాటే ప్రామాణికం.