ఎన్‌జీరంగ వర్సిటీ వీసీని తెలంగాణవారినే నియమించాలి టీ జేఏసీ చైర్మన్ కోదండరాం
హైదరాబాద్, అక్టోబర్ 17 (జనంసాక్షి): అగ్రికల్చర్ యూనివర్శిటిలో జాయింట్ యాక్షన్ కమిటీ అఖిలపక్షానికి జేఏసీ చైర్మన్ కోదండరాం హాజరై మాట్లాడుతూ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన శాస్త్రవేత్తనే నియమించాలని బుధవారం జరిగిన సమావేశంలో రాజకీయ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం డిమాండ్ చేశారు. బాషీర్‌బాగ్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశాని హాజరైన కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత విద్యార్థులకు నష్టం వాటిల్లు తుందని ఇప్పటికైన సీమాంధ్ర సర్కార్ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా తెలంగాణ ప్రాంత వ్యక్తిని నియమించాలని అన్నారు. అన్ని రంగాల్లోను సీమాంధ్ర వలసవాదులు చోరబడి తెలంగాణ ప్రాంత ప్రజలను అనిచివేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నింటికి పరిష్కార మార్గం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు తోనే ఈ సమస్యలన్ని సమసిపోతాయని ఈ ప్రాంత రైతంగానికి, ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఐక్యంగా ఉద్యమించి తెలం గాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతామని తెలంగాణ వచ్చేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆచార్య కోదండరాం అఖిలపక్ష సమావేశంలో అన్నారు.