ఎఫ్‌డీఐలపై నిర్ణయం వెనక్కు తీసుకోవాలి – భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) డిమాండ్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 4 (జనంసాక్షి) :

రిటైల్‌, సింగిల్‌ బ్రాండ్‌, ప్రసార రంగాల్లో ఎఫ్‌డీఐల ప్రవేశానికి అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని భారత కమ్యూనిస్తూ పార్టీ మావో యిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు పత్రికా కార్యాలయాలకు లేఖ పంపారు. సెప్టెంబర్‌ 14న కేంద్ర ప్రభుత్వం బహుళ బ్రాండ్‌ రిటైల్‌ రంగంలోకి 51 శాతం, సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌లోకి 51 శాతం కంటే ఎక్కువ, పౌర విమానయానంలోకి 49 శాతం, విద్యుత్తు ఎక్చేంజీల్లోకి 49 శాతం, ప్రసార రంగంలోకి (డిటిఎచ్‌ సహ) 49 నుండి 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) అనుమ తించాలన

కేబినెట్‌ నిర్ణయాన్ని తీసుకుందని పేర్కొన్నాఉ. పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న నిరసనలను బేశాతరు చేస్తూ సెప్టెంబర్‌ 20న నోటిఫికేషన్‌ జారీ చేయడంతో ఇది తక్షనం అమల్లోకి వచ్చిందని తెలిపారు. దీంతో విదేశీ పెట్టుబ డీిదారులు దేశంలోని పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రిటైల్‌ రంగంలో మదుపులు పెట్టి రుకాణాలు తెరిచే అవకాశాలు కల్పించారు. ఇతర రాష్ట్రాలు వాటని అనుమతించాలా లేదా అనే నిర్ణయాన్ని తామే తీసుకోవచ్చని నిర్ణయం రాష్ట్రాలపైకి నెట్టారు. ఈ ప్యాకేజీపై ‘జాతి ప్రయోజనాల రీత్యా’ అంటించిన ప్రభుత్వం హెచ్చరికలో ఇలా పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ మరిన్ని ఎఫ్‌డిఐలు రాబోతున్నాయి, 1991 నాటి నూతన ఆర్థిక విధానాలు రిహార్సల్స్‌ అయితే ఇప్పుడు జరుగుతున్నది మన దేశ అంతానికి గొప్ప ఆరంభం, తిరగబడటం ఆరోగ్యానికి హానికరం. పుండు మీద కారం జల్లినట్టుగా డీజిల్‌ ధర ప్రతి లీటర్‌కు రూ.5 పెంచేవారు. సబ్సిడీ వంటగ్యాస్‌ సిలిండర్ల సరఫరాను కుటుంబానికి సంవత్సరానికి ఆరుకు కుదించారు.

ప్రతికపక్ష పార్టీలు ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సెప్టెంబరు 20న బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే తాము గతంలో లేదా ప్రస్తుతం అధికారంలో వుండిన రాష్ట్రాల్లో అవి ఒక దాన్ని మించి ఒకటిగా సమ్రాజ్యవాద అనుకూల విధానాలను వేగంగా అమలు చేయడానికి ఎలా పోటీ పడ్డాయి అనే వాటి గత రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుంది. 2011 నవంబర్‌ నాటి నామమాత్ర నిరసన అనే నాటకాన్నే మరోసారి ప్రదర్శిస్తున్నయి. యూపీఏ, ప్రతిపక్ష పార్టీలు అనే రెండు పేర్లుగల ఈ దొపిడీదారుల ముఠా అంతా ఒకే తానులోని గుడ్డలే అనీ సులభంగా గ్రహించచ్చు. ఈ కుళ్లుకంపు గొట్టే పార్లమెంటరీ ప్రహసనంలో ఈ దళారీలు తమ తమ పాత్రలను పోషించడం పూర్తయిపోయక, ఎఫ్‌డీఐ రారాజులా ముందు తలుపు గుండా దళారీ పాలకవర్గాలు పరిచిన ఎర్ర తివాచీ మీద బాజాప్తుగా ప్రవేశించి, దేశ నలుమూలల్లో తాను అడుగు పెట్టిన చోటల్లా తన ఉక్కుపాదాల కింద కోట్లాది చిన్న చిల్లర వ్యాపారుల్నీ, రైతాంగాన్నీ తొక్కిపడేసుకుంటూ పోతుంది. సార్వభౌమత్వం అనేది ఇందుకోసం మనం చెల్లించాల్సిన స్వల్ప మూల్యం మాత్రమే. చిన్న చిల్లర వ్యాపారస్తుల, రైతుల ఆత్మహత్యలు అనూహ్యంగా పెరిగితే అది ఎఫ్‌డిఐ ద్వారా సాధించదల్చుకున్న ‘ఆర్థిక అభివృద్ధి’తో పాటు అనివార్యంగా జరిగే నష్టం (కొలాటరల్‌ డామేజి) గా ఉంటుందంతే.

ఎఫ్‌డిఐని అనుమతించాలా లేదా అనేది రాష్ట్రాలకే వదిలేశాం అంటున్నారు కనుక కాంగ్రెస్‌ నేతృత్వంలో వున్న ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఎలాగూ వాటని అనుమతిస్తాయి. అకాలీదళ్‌ నిస్సిగ్గుగా ఈ నిర్ణయానికి మద్దతు తెలిపే వున్నది. మిగతా పార్టీలు కూడా దొడ్డిదారి నుంచి అదే బాట పడ్తాయి. ఎందుకంటే అవన్నీ కూడా ఇప్పటివరకూ, ప్రతి రంగంలోనూ సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థల ప్రయోజనాలు నెరవేర్చడానికే నానాపాట్లు పడుతూ వస్తున్నా దళారీ పార్టీలే కనుక. కేవలం పరువు కాపాడుకోవడానికి మహా అయిష్టంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ యుపిఎ నుంచి బయటకు వస్తున్నానని ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాల్లో కొన్ని మార్పులు చేస్తే (అంటే డీజిల్‌ధర పెంపుని మూడు లేదా నాలుగు రూపాయాలకు తగ్గిచడం, సిలిండర్ల సంఖ్యని పెంచడం లేదా బహుళ బ్రాండ్‌ రిటైల్‌ వ్యాపారంలో ఎఫ్‌డిఐని కొంత శాతం తగ్గిండచడం వంటివి) తాను పునరాలోచిస్తానని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఇప్పటికే సరిగ్గా ఎఫ్‌డిఐ విషయం మీదే గత సంవత్సరం హిల్లరీ క్లింటన్‌ మమతా బెనర్జీని నేరుగా కలిసింది. కనుక ఆమె తన రాష్ట్రంలో ఎఫ్‌డిఐకి ఎర్రతివాచీ పరిచినప్పుడు ఆశ్చర్యపోనవసరం లేదు. ఎన్నికలు, పదవికి వేలాడ్డం లాంటి ‘గంభీరమైన’ విషయాలను దృష్టిలో వుంచుకుని సమయం చూసుకుని చేస్తార్నమాట, మతశక్తుల పురోగమనాన్ని తన పార్టీ కోరుకోవడం లేదు కనుక ఎఫ్‌డిఐ విషయంలో యుపిఎకి మద్దతు ఉపసంహరించుకోవడం లేదని ములాయం ప్రకటించడం పచ్చి అబద్ధం. ఢిల్లీ సర్కారుకు సామంతులైన వీళ్లెవరికీ వెన్నెముకా లేదు, ఎఫ్‌డిఐ రాకాసులకు తమ జీవనోపాధిని కోల్పోబోతున్న 4, 5 కోట్ల చిన్న రిటైల్‌ వ్యాపారస్తుల మీద (వారి మీద ఆధారపడిన మరో 15, 20 కోట్లమంది ప్రజల మీద) అక్కర అంతకంటే లేదు. రివిజనిస్టు సిపిఐ, సిపిఎంలు సహా వీటిల్లో ఏ ఒక్క పార్టీ కూడా ఎఫ్‌డిఐని తీసుకురావాలనే నిర్ణయాన్ని సంపూర్ణంగా తిర్సకరించడం లేదంటే, దాన్ని సంపూర్ణంగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేయడం లేదంటే అది వారూ తోడుదొంగలనడానికి నిదర్శనం అనే విషయాన్ని మన గంభీరంగా గమనంలోకి తీసుకోవాలి. వారి సోకాల్డ్‌ నిరసన, నామమాత్ర బంద్‌లు, ధర్నాలు తమ రాష్ట్రాలకు (తాము మంగడానికి  వీలుగా) మరిన్ని నిధులు మంజూరు చేయించుకోవడానికో లేదా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కోట్ల రూపాయల విలువ చేసే అవినీతి, కుంభకోణాల అసంఖ్యాకమైన కేసుల పగ్గాలు వున్నాయి కనుక వాటిని వదులు చేసుకోవడానికో మాత్రమే.

ఒకవైపు వరల్డ్‌ ఆఫ్‌ వర్క్‌ 2011 నివేదిక ఉద్యోగాల విషయంలో ప్రపంచం భవిష్యత్తు అంధకారబంధురంగా వుండని చెప్తోంది, 150 దేశాల్లో చేసిన ఒక ప్రపంచ సర్వే ప్రపంచవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక అభద్రత విపరీతంగా పెరిగిందని ఘోషిస్తోంది. మరి అబద్ధాలు చెప్పడాన్ని వృత్తిగా చేసుక్ను ప్రధానమంత్రి ఏ వుద్యోగాలు గురించి మాట్లాడుతున్నట్టు? వాల్‌మార్ట్‌, టెస్కో వంటి ఎఫ్‌డిఐ రాకాసుల మొత్తం చరిత్ర అంతా (అమెరికాలో సహా) చెప్పేదేంటంటే వాటిని ఎక్కడ విత్తాతే అక్కడల్లా బ్రహ్మాండమైన నిరుద్యోగ, తక్కువ ఉద్యోగిత పంటలనందించాయని, ఒక్క వాల్‌మార్ట్‌ రుకాణం 13,000 చిన్న చిల్లర దుకాణాల్ని అణగదొక్సేఇ, 4,000 ఉద్యోగాలకు ఉద్వాసన పలకగలదు. కొత్తగా వచ్చిన ఒక్కో ఉద్యోగం వెనుకా కనీసం 20 రాకా కోల్పోయిన ఉద్యోగాలు వుంటాయి. భారతదేశం వంటి వెనుకబడిన దేశాల్లో ఒక్క ఉద్యోగానికొచ్చే ఆదాయం మీద కుటుంబంలో ఎంతమంది ఆధారపడి వుంటారు అనేది లక్కబెడితే వచ్యే చిత్రం ప్రధానమంత్రిగారు చెప్పనట్టు అందంగా వుండదు. ర్తసిక్తంగా వుంటుంది. ఆ కొత్తగా వచ్చే ఉద్యోగాలు కూడా ఎక్కువ శాతం తక్కువ జీతాలు గల, గ్యారంటీ లేని, ఇళ్లు విరగ్గొట్టుకునే తాత్కాలిక ఉద్యోగాలుగా, పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాటను, హక్కులను ఉల్లఘించేవిగా వుంటాయి. యూరోప్‌లోనూ, అమెరికా సహా ఇతర సామ్రాజ్యవాద దేశాల్లోనూ ప్రభుత్వాధినేతలందనూ నిరుద్యోగ భూతాన్నీ దాన్ని వెన్నంటి తమ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న నిరసనలలను ఎలా సంబాళించాలో అర్థం కాక తలయాయలు పట్టుకుని వున్నారు. మరి మన దేశంలో వాలుతున్న ఈ బహుళజాతా రాబందులన్నీ ఆ దేశాల్లో పుట్టి పెరిగినమే. తమ దేశాల్లో ఉద్యోగాలను కల్పించడంలో ఒప్పందాలు చేసుకోవడానికి వచ్చి, అమెరికా పౌరులకు మరిన్ని ఉద్యోగాలను కల్పిచానని గొప్పలు చెప్పుకుంటూ తిరిగి వెళ్లడాన్ని మన మర్చిపోయామని భావిస్తున్నారా అబద్ధాల గురువు అయిన ప్రధనామంత్రిగారు? తన దేశంలోనే ఉద్యోగాలు కురిపంచగల బహుళజాతి ఉద్దండసంస్థలైన వాల్‌మార్‌టలను, టెస్కోలను, కారేషోర్‌లను, మెట్రోలను లకిగి వున్న ఒబామాగారు తన పౌరులకు ఉద్యోగాల కోసం ప్రపంచ యాత్రలు ఎందుకు చేస్తున్నట్టోఝ ‘మనల్ని కష్టకాలాల్నించి బైటకి తేవడానికి’ గుత్త రాకాసులను ఆహ్వానించేకంటే ముందు అమెరికాలో ఎన్ని బెయిలౌట్లు ప్రకటించినా ఇలాంటి గుత్త రాకాసులే ఒకదాని వెంబడి ఒకటిగా కుప్పకూలడాన్ని అపమని ప్రధానమంత్రి తన యజమానులను అడక్కోడదూ?

దళారులను లేకుండా చేయడం ద్వారా ఎఫ్‌డిఐ రైతాంగానికి లాభాలు చేకూరుస్తుందని ప్రధానమంత్రి అనడం ఒక క్రూర పరిహాసం. ఏం ఉత్పత్తి చేయాలి, ఏ పురుగుమందులు, ఎరువులు వాడాలి అంటే ఒక్క మాటలో ఉత్పత్తికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్నీ ఈ రైటైల్‌ రాకాసులే నిర్ణయించడమే కాకుండా, ఒకసారంటూ మార్కెట్‌ మీద పైచేయి సాధించాక అవి రైతులకొచ్చే లాభాల్లో విపరీతంగా కోత విధిస్తాయి. వారు రైతంగాన్ని ఒకే రకమైన పంటనే వేయాలని ఒత్తిడి చేస్తారు, దానివల్ల రైతాంగం జీవనోపాధి దెబ్బతింటుంది. వారికి విపరీతమైన ధరలకు ప్రతి వస్తూవనూ కొనుక్కోవడానికి నెట్టబడతారు. మరోవైపు భూసారం దెబ్బ తిని పర్యావరణానికి ఎనలేని హీని జరుగుతుంది. అంతిమ ఫలిఆతంగా సేద్యం రోజురోజుకు భారంగా మారడంతలో ఈ రాకాసుల డిమాండ్లను  నెరవేర్చలేని దుస్థితికి చిన్న, మధ్య తరగతి రైతులు నెట్టబడతారు. వారు కార్పోరేట్‌ సేద్యానికి తమ భూముల్ని అమ్ముకుని బికారులుగా మారిపోవాల్సి వస్తుంది. మన దేశంలో ఇప్పటికే భయానకంగా పెరిగిన వ్యవసాయ సంక్షోభాన్ని ఇది మరింతగా పెంచి రైతాంగంలో మరిన్ని ఆత్మహత్యలకూ, అశాంతికీ ఇది దారి తీస్తుంది. ఎఫ్‌డీఐ దుకాణాలు స్థానిక ఉత్పత్తులను 30 శాతం కొనాలని పెట్టిన షరతూ కూడా ఒక బూటకం. ఎందుంటే ఈ దుకాణాలు ఏం కోంటున్నాయి. ఏం అమ్ముతున్నాయి అనేదాన్ని పరిశీలించి అదుపు చేయగల ఎటువంటి వ్యవస్థ మన దేశంలో లేదు. భవిష్యత్తులో ఇటువంటివి ఏర్పడకుండా ముడుపులు చూసుకుంటాయి. లేదా డబ్ల్యుటీవో వంటి సర్వాధికార సంస్థలు వాటిని ఎలా ఉల్లాంఘించాలి లేదా నిబంధనలకు మినహాయింపులు ఎలా సృష్టించాలి అనే విషయాలన్ని చూసుకుంటాయి.

అయితే ప్రధానమంత్రి ఒక విషయంలో మాత్రం సత్యం పలికారు. ఉత్పత్తిదారుకీ, వినియోగదారుకీ మధ్యన ఉండే బ్రహ్మండమైన సంక్లిష్టమైన గొలుసులో భాగంగా వుండి జీవనోపాధిని పొందిన లేదా కొన్ని లాభాలు చేసుకున్న లక్షలాది చిన్న, పెద్ద దళారులను ఇది లేకుండా చేస్తుంది. వారిని దళారులు అన్నా మరో పేరు పెట్టిన, ఉత్పత్తిదారుల నుండి వినియోగదతారులకు సరుకులను చేరవేసే ఒక సంక్లిష్టమైన క్రమానికి అసంఖ్యకంగా మనుషులు అవసరమౌతారు. మరిప్పుడు ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు. వారు కోల్పోయిన లాభాలు ఇప్పుడు ఎవరి జేబులోకి పోతాయి అనేది ప్రశ్న. కచ్చితంగా రైతులు కారు. వినియోగదారులు కూడా కారు ఎందుకంటే వారు ఏం సరుకులు వాడాలి( తినాలి, తాగాలి, తొడుక్కోవాలి, వినాలి, చూడాలి మొదలైన అన్ని) బహుళజాతి సంస్థలే  నిర్ణయించడంతో పాటు ఒకసారంటూ మర్కెట్‌ను కబలించాక ఎఫ్‌డీఐ రాకాసులు విపరీతంగా సరుకుల ధరలను పెంచేస్తాయి. (అసలు ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా వీరి దుకాణాల్లో ధరలు తక్కువగా ఏం లేవనేది రుజువుగల వాస్తవం) లాభపడేది పార్లమెంటులోనూ, అసెంబ్లీలోనూ కూర్చుని త్వరత్వరగా సరుకులను అమ్ముకుని పోవాలనుకునే వ్యాపారస్తుల్లా దేశాన్ని పల్లీలకు అమ్మేసీ మడుపుల్ని జేబుల్లో కుక్కుకోవాలనుకుంటున్న పెద్ద దళారులు. దేశం లోపల అతి పెద్ద లాభాలు దొరికేది ఇప్పటికే రిటైల్‌ రంగంలో, ఇతర ప్రైవేట్‌ సంస్థల్లో బహుళజాతి కంపెనీలతో తమ పెట్టుబడులను ముడివేసి పెట్టుకున్న దళారీ నిరంకుశ బూర్జువాలకు. ప్రపంచం అంతా గుత్తసంస్థల దారిన పోతున్నప్పుడు దళారీతనాన్ని కూడా ఈ బందిపోట్లకు గుత్తకిచ్చి చిల్లర దొంగల్నీ జేబులు కొట్టేవాళ్లనీ ఏరిపారేస్తే పోలా? ఎంత కాదనుకున్నా, అమెరికావారి సౌజన్యంతో భారతదేశం సూపర్‌ పవర్‌గా మారే మార్గంలో దూసుకుపోతుంది కదా?

తన అమెరికా యాజమానులచే ఇలాంటి ఆర్థిక సంస్కరణ లను  బేషుగ్గ నమ్రతగా అమలు చేయడం కోసమే తిరిగి తన పాత ఉద్యోగంలోకి తీసుకురాబడ్డడని మనం సులభంఆ అర్థం చేసుకోగల ఆర్థిక మంత్రి చిదంబరం ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 30,000 కోట్లను కచ్చితంగా సంపాదిస్తాననీ తద్వారా ఎఫ్‌డీఐని తేవడం ద్వారా మట్టుబెట్టాల్సిన మహమ్మరీగా ప్రధానమంత్రి చిత్రీకరిస్తున్న బడ్జెట్‌ లోటును అరికడతాననీ ఆత్మవిశ్వసం ప్రకటించాడు. 30,000 కోట్లే ఎందుకు? ఇంకోంచేం పెద్దగా ఆలోచిద్దాం. మన గౌరవనీయులైన మంత్రులు వృత్తిపరమైన నిపుణత గల చేతుల్లో వేల కోట్ల రూపాయల లాభాల్ని గడిస్తూ అత్యంత లాభదాయకమైన ప్రభుత్వరంగ పరిశ్రమగా పరిఢవిల్లుతున్న కుంభకోణాల పరిశ్రమల నుండి పెట్టుబడుల్ని ఉపసంహరిస్తే ఎలా వుంటుంది? లేదా పోనీ ఒకసారికి ఐపిఎల్‌ సీజన్‌ని రద్దు చేయడం గానీ? సరే మన భారతవాసులం అల్ప సంతోషులం కనుక కేవలం ఒక్క 2జీ కుంభకోణం నుండి4 ఉపసంబహరించుకుంటే లేదా దానికంటే కొంచేం పెద్దదైన ఇటీవలి బొగ్గు బ్లాకుల కేటాయంపు కుంభకోణాల్ని ఒకదాని నుండి విదేశి బ్యాంకుల్లో మూలుగుతున్న 80 లక్షల కోట్ల రూపాయలను మొత్తంగా కాకున్న కనీసం నాలుగో వంతునైనా వెనక్కి తెచ్చుకోవడం ఎలా వుంటుంది? లేదా శాశ్వాతంగా కాకున్న కనీసం ఒక్క సంవత్సరం పాటు మైనింగ్‌ కింగ్‌లైన గాలి సోదరులవో, జగన్మోహనుడివో లాభాలను స్వాధీనం చేసుకుంటే ఈ మహాత్తర దేశానికి ప్రధానమంత్రిగా సింగ్‌గారు మనకు ఆరోగ్యం, విద్య, గూడు, ఉద్యోగాలు లాంటివన్ని ఇవ్వగల్గుతారు కదా పాపం, అప్పుడు ఇందుకోసం వారు మనల్ని మింగమంటున్న ఈ ఎఫ్‌డీఐ గరళాన్ని మింగకుండా తప్పుకోగల్గుతాం కదా? పోనీ మన దేశంలో జిందల్‌, మిట్టల్‌ వంటి దళారీ నిరంకుశ బూర్జువాలను కనీసం రెండు సంవత్సరాలపాటు తమ భవనాల్లో రోజుకొకటి చొప్పున వంటగ్యాస్‌ సిలిండర్లు వాడకుండా నెలకు రెండు మాత్రమే వాడమని నిబందన పెడితే ప్రస్తుతం మనం ఎదుర్కోంటున్న సిలిండర్ల సంక్షోభానికి పరిష్కారం దొరుకుతుందేమో? లేదా ఆంటిల్లా లాంటి చూస్తే కల్లోకోచ్చే భయానకర కట్టాడాలపై అనుత్పాదకంగా కోట్లు తగల్యేకోడదు అని నిషేదం పెట్టేసి ఆ నిధులన్నీటినీ ఎఫ్‌డీఐ సర్వరోగనిరోగనివారణి ద్వారానే కట్టగలం అని ప్రధానమంత్రి నమ్మబలుకుతున్న గొడౌన్లు, కోల్డు స్టోరేజి సౌకర్యాలు వగైరాలను నిర్మించడానికి మళ్లిస్తే ఎలా వుంటుంది.

మన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న కష్టకాలాన్ని అధిగమించడానికి  ఎఫ్‌డీఐని తేవడం అవసరం అనీ, భారతదేశాన్ని విదేశి మదుపులకు ఆకర్షినీయమైన గమ్యంగా మార్చడం జాతి ప్రయోజనాలను నెరవేరుస్తుందని ప్రధానమంత్రి అంటున్నాడు. ప్రపంచంలోనే సంపద్వంతమైన అనేక సహజ వనరులకు నిలయం, ప్రపంచంలోనే అతి పెద్ద మానవ వనరులు, వాటి అభివృద్దికి అపారమైన అవకాశౄలు గల రెండవ దేశం అయిన మన ప్రియమైన భారతదేశానికి ఎఫ్‌డీఐ  అవసరమేమున్నదసలు? ఈ వనరులన్నిటినీ బడా భూస్వాములు దళరీ నిరంకుశ బూర్జువాల, వారి సామ్రాజ్యవాద యజమానుల ఇనుప కౌగిలి నుండి, దోపిడి నుండి విడుదల చేసి, ఈ దేశ ప్రజలకు వాటిని దేశ అభివృద్ది కోసం వినియోగించే అవకాశాన్ని కల్పించగల్గితే ఏ లోటు బడ్జెట్లూ వుండవు, కష్టకాలాలు వుండవు.

ఇప్పుడు కివాల్సింది ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ కాదు, భారత పాలకవార్గాల ప్రతినిధులుగా పార్లమెంటులో అక్రమంగా అధికారంలో కూర్చున్న ( ఎందుకంటే వీరికి మొత్తం ప్రజల నుండి పావువంతు ఓట్లు  కూడా లేవు, అందుకని వీరికి కోట్లాది ప్రజల జీవితాల్ని నిర్ణయించే నైతికి హక్కు, అధికారం అసలే లేవు) ఈ బందిపోట్ల నుండి 110 కోట్లు పైగా వున్న మన అత్యంత వినాశకరంగా ప్రబావితం చేసే నిర్ణయాలను తీసుకునే అధికారాల ఉపసంహరణ.

2008 నుండి తమను చుట్టుముట్టి ఊపిరాడకుండా చేస్తున్న ఆర్థిక సంక్షభం నుండి బయటపడ్డానికి సామ్య్రాజ్యవాదులకు మన దేశంలోని సంపద్వంతమైన వనరులు కావాలే తప్ప మన కష్టకాలాల నుండి బయటపడ్డానికి మనకు విదేశి పెట్టుబడులు అవసరం లేదు.

మన కష్టకాలాన్నీ బడా భూస్వాములు, దళారి నిరంకుశ బుర్జువాల దోపిడీ వల్లా, ఈ పాలకవర్గాలు మనదేశక సార్వభౌమత్వాన్ని సామ్రాజ్యవాదుల పాదాక్రాంతం చేసి వారికి మనల్ని నిలువు దోపిడి చేసే అధికారాన్ని ఇవ్వడం వల్లే తప్ప మన దేశం ఎఫ్‌డీఐకి ఆకర్షీయమైన గమ్యంగా వుండకపోవడం వల్ల కానేకాదు.

ప్రియమైన ప్రజలారా! ్నపనజాస్వామికవాదులారా, దేశభక్తులారా!

ఎఫ్‌డీఐని తీసుకురావడం కోసం సోనియా, మన్మోహన్‌, చిదంబరం అహ్లువాలియా, రంగరాజన్‌ ముఠా చేస్తున్న తలకిందులు వాదనలన్నిటీని నిర్ద్వందంగా తిపికొడుతూ ఎండగట్టండి. రిటైల్‌ తదితర రంగాల్లొకి ఎఫ్‌డీఐని అనుమతించే నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేయండి. తమ రాష్ట్రాల్లో చాలా కాలం ముందు నుండే ఎఫ్‌డీఐ ప్రవేశానికి మంతనాల్లొ మునిగి ఉన్న అధికశౄతం ప్రతిపక్షాల నామమాత్రమైఊన, బూటకమైన నిరసనలను బహిర్గతం చేయండి. రిటైల్‌ రంగంలోకి ఎఫ్‌డీఐని తీసుకోచ్చే నిర్ణయం ఏదో మామూలు నిర్ణయం కాదు. దేశంలోని అత్యధిక మెజారిటీ ప్రజల జీవితాలను అత్యంత అననుకూలంగా ప్రభావితం చేయగల ప్రభుత్వ అతి పెద్ద ఏకైక నయా ఉదారవాద ఆర్థిక నిర్ణయంగా ఇది మారవచ్చు. దీనిని అనుమతిస్తే ఇప్పటికే నయా వలసవాద దోపిడీ, లూటీ, అదుపులో గోంతులోతు కూరుకుపోయిన మన దేశం అతి వేగంగా ఒక బానిస దేశంగా మారిపోవడానికి దారి తీస్తుంది. మన జీవితంలో గానీ, ఏ రంగంలో గానీ ఇది ప్రభావితం చేయని అంశం ఒక్కటి కూడ వుండవు, ఎందుకంటే అవన్నీ నానాటికీ మరింతగా మార్కెట్‌తో ముడివేయబడ్తూ పోతున్నాయి. ఈ నిర్ణయం మన దేశానికి, మనకు ఎంత ముప్పుగా పరిణమిస్తుందో గుర్తించి దానికి వ్యతిరేకంగా సర్వశక్తూలనూ ఒడ్డి పోరాడండీ. నిజమైన దేశభక్తులు ఉవ్తెత్తున పైకి లేచి సామ్రాజ్యవాద దోపిడీదారుల చేతుల్నుండి మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి బరి గీసి నిలబడాలని పిలుపునిచ్చారు.