ఎఫ్‌డీఐలపై యూపీఏకు బీఎస్పీ మద్దతు
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఎఫ్‌డీఐలపై యూపీఏ ప్రభుత్వానికి బీఎస్పీ బాసటగా నిలువనుంది. రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై జరిగే ఓటింగ్‌లో పాల్గొంటామని, ప్రభుత్వానికి మద్దతునిస్తామని ఆపార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. నిన్న ఇదే అంశంపై లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో బీఎస్పీ పాల్గొనకుండా వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.