ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ చెక్కులు

పంపిణీ చేసిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం

పేదల గుండెల్లో కోలువైన దైవం సిఎం కేసీఆర్‌ గారు మనసున్న ముఖ్యమంత్రి మన కేసిఆర్‌ గారికి మనందరం అండగా ఉందాం తెలంగాణ ప్రజలు ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతిక్షనం తపించే ముఖ్యమంత్రి కేసిఆర్‌ గారు..
అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం గారు పిలుపునిచ్చారు..*

మానవపాడు జులై(జనం సాక్షి) అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అలంపూర్ నియోజక వర్గంలో ఉన్న వివిధ మండలాల వారికి సీఎం సహాయ నిది ద్వారా మంజూరు అయిన 29 చెక్కులు 8,68,500/- లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు
మండలాల వారీగా చెక్కుల వివరాలు:-
1.ఉండవల్లి మండలం 4 చెక్కులకు గాను 88,500/- వేల రూపాయలు..
2. ఐజ మండలం 7 చెక్కులకు గాను 2,85,500/- లక్షల రూపాయలు..
3.మానవపాడు మండలం 4 చెక్కులకు గాను 85,000/- వేల రూపాయలు..
4.అలంపూర్ మండలం 2 చెక్కులను గాను 53,500/- వేల రూపాయలు..
5.వడ్డేపల్లి మండలం 4 చెక్కులకు గాను 1,13000/- వేల రూపాయలు..
6.ఇటిక్యాల మండలం 5 చెక్కులకు గాను 1,06,000,/- వేల రూపాయలు..
7.రాజోలి మండలం 3 చెక్కులకు గాను 1,37,000/- వేల రూపాయలు…
మొత్తం 29 చెక్కులకు గాను 8,68,500/- లక్షల రూపాయలు..
ఈ సదర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..
అనారోగ్యం బారినపడి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు.. సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందిస్తున్న ఘనత సిఎం కేసిఆర్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. యావత్‌ భారతావనిలో లేనటువంటి ప్రజా సంక్షేమ పథకాలు తెలంగాణ అమలుకావడం మన అదృష్టమన్నారు. కేసిఆర్‌ గారి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని ఎమ్మెల్యే సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలంపూర్ నియోజక వర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షతో 100 పడకల ఆసుపత్రి కోసం అహర్నిశలు కృషి చేసి, మరి సాధించానని ఎమ్మెల్యే గారు అన్నారు. రాబోయే కాలంలో అలంపూర్ నియోజక వర్గం ఆరోగ్యానికి నిలయంగా నిలుస్తుందనడటంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు సుమారుగా 2019 నుండి ప్రసుత సంవత్సరం నాటికి దాదాపుగా 1200 మందికి రూ.4కోట్ల వరకు సిఎంఆర్‌ఎఫ్‌ రూపేణా చెక్కులను ప్రజలకు అందచేశామని ఎమ్మెల్యే గారు అన్నారు. అంతేకాదు కేసిఆర్‌ గారి నాయకత్వాన్ని యావత్‌ భారతదేశం కోరుకుటుందని, అటువంటి మంచి మనసున్న మనిషికి ప్రతి ఒక్కరు అండగా ఉండాల ఎమ్మెల్యే గారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బిసమ్మ ,ఎంపీపీ రజిత గారు, జెడ్పీటీసీ కశపోగు రాజు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి.కరుణ ,వైస్ ఎంపీపీ దెవన్న గారు,పార్టీ మండలాల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డీ కొర్విపాడు నాగేశ్వర్ రెడ్డి గారు,మహేశ్వర్ రెడ్డీ బైరపురం రమణ ,శ్రీనివాసులు,శ్రీనివాస్ గౌడ్ ,ఉప అధ్యక్షడు అనంత రెడ్డీ గారు,యువజన విభాగం అధ్యక్షుడు శంకర్ గౌడ్, రవి రెడ్డీ ,భాస్కర్ రెడ్డి ,మాజీ ఆలయ చైర్మెన్ రవి ప్రకాష్ గౌడ్ గారు,సర్పంచుల సంఘం అధ్యక్షులు లోకేశ్వర్ రెడ్డీ జయచంద్ర రెడ్డీ ,ఎంపీటీసీ కురుమూర్తి , అమరావాయి కాంత రెడ్డీ ,రాజోలి ముగేన్న ,సర్పంచులు మదమ్మ , వినుసేంట్ ,మరియు వావిలాల చంద్ర గౌడ్ ,దేవసహయం , దేవదాస్ ,బడెసబ్ ,గోపాల్ దీన్నే రవి వేంకటన్నా ,దాసు , రాజపురం రమేష్ ,పులీకల్ కిషోర్ మధుసూదన్ రెడ్డి ,పుల్ల రెడ్డీ ,ప్రసాద్ ,మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..