ఎలుకల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
అధికారులకు మంత్రి పితాని ఆదేశం
ఏలూరు, జూలై 31 : ఆచంట మండలం వల్గూరు గ్రామంలో 292 ఎకరాల విస్తీర్ణంలో ఎలుకల వలన పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ పంట నష్టాన్ని ప్రకృతి వైపరీత్యాల నష్టంగా భావించి సెంట్రల్ రిలీఫ్ ఫండ్ కింద పూర్తి స్థాయిలో రైతుకు పరిహారం లభించేలా తగు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని మంత్రి కోరారు. ఎన్నడూ లేని విధంగా వల్గూరు గ్రామంలో ఎలుకల భీభత్సానికి 292 ఎకరాల పంట దెబ్బతిన్నదని , రైతాంగం ఆర్థికంగా నష్టపోయారని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని పితాని చెప్పారు.