ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి
పెద్దపల్లి(జనం సాక్షి) :ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండింది. 148 మీటర్లకు గాను.. ప్రస్తుతం 147 అడుగులకు పైగా నీటి మట్టం చేరింది. దీంతో ప్రాజెక్ట్ 20 గేట్లు ఓపెన్ చేసి.. నీటిని కిందకు వదులుతున్నారు అధికారులు. లక్షా 31వేల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వస్తుండగా… లక్షా 7వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో గోలివాడ పంప్ హౌజ్, సుందిళ్ల, అన్నారం, కాళేశ్వరం పనులు నిలిచిపోయాయి.