ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో 6 రోజుల పాటు పరిశుభ్రతకార్యక్రమాలు

పిన్స్ పాల్ కృత మూర్తి
ఎల్లారెడ్డి 03 సెప్టెంబర్ జనం సాక్షి  . తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుకులాల ప్రాంగణలలో పరిశుభ్రతలో  పాఠశాల యాజమాన్యంతో పాటు స్థానిక ప్రజలను, ప్రజా ప్రతినిధులను, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేసే సదుద్దేశంతో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి  రోనాల్డ్ రోస్  తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకులాలో వారం రోజులపాటు “స్వచ్ఛ గురుకుల” కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు శనివారం పిన్స్ పాల్. కృత మూర్తి తెలిపారు  ఈ కార్యక్రమ కొనసాగింపులో భాగంగా,  సెక్రటరీ  ఆదేశాల అనుసారంగా ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల / కళాశాలలో తేదీ 5నుండి  11 వరకు  స్వచ్ఛ గురుకుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్  క్రాంతి కృతా మూర్తి  అన్నారు
ప్రతిరోజు ఒక వినూత్న కార్యచరణతో వారం రోజులపాటు స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యంతో జరిగే ఈ కార్యక్రమంలో  పాఠశాల ప్రాంగణాన్ని  పరిశుభ్ర ప్రాంగణంగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్య క్రమం లో  సాంఘిక సంక్షేమ గురుకుల సిబంద్ధి పాల్గొన్నారు

పిన్స్ పాల్ కృత మూర్తి

తాజావార్తలు