స్టేట్ బ్యాంక్ సిబ్బంది మా అభాగ్యుల వృద్ధాశ్రమంలో నిత్యావసర వస్తువుల పంపిణీ..

గంభీరావుపేట జూలై 10(జనం సాక్షి); గంభీరావుపేట మండల కేంద్రంలోని మా అభాగ్యుల వృద్ధాశ్రమంలో బంగ్లా రమేష్ కుమారుడు బంగ్లా అన్వేష్ గౌడ్ కొన్ని రోజుల కిందట మరణించడం జరిగింది వారి జ్ఞాపకార్థం స్టేట్ బ్యాంక్ (ఎస్బిఐ) సిబ్బంది నిత్యావసర వస్తువులను మా వృద్ధాశ్రమంలోపంపిణీ చేశారు. ఈ సందర్భంగా బియ్యం, పప్పులు, నూనె, పండ్లు తదితర అవసరమైన వస్తువులను ఆశ్రమ లో అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మల్లుగారి నర్సగౌడ్ ,మాట్లాడుతూ అన్వేష్ గౌడ్ చిన్న వయసులోనే మరణించడం జీర్ణించుకోలేని విషయం ఈ సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని అన్నారు, మా వృద్ధాశ్రమ తరపున వారికి ఆత్మ శాంతి చేకూర్తుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎస్బిఐ బ్రాంచ్ వారు కుటుంబ సభ్యులు ఉన్నారు



