మానవత్వం మంట కలిసింది…. కన్న తల్లికి బిడ్డ భారమైంది

— పసికందును రైలు పట్టాల పక్కన, వదిలిపెట్టిన కసాయి తల్లి
— మగ శిశువు క్షేమం
— మక్తల్ ఆస్పత్రికి తరలింపు
కృష్ణ, జూలై 10 (జనం సాక్షి ): రాను,, రాను. మానవత్వం మంట కలిసి పోతోంది.తల్లి దండ్రులు,తో బుట్టువులు,అన్నా, తమ్ములు ఒకరికొకరు భారమై దూరం చేసుకుంటున్న ఘటనలు సమాజంలో ఎక్కువయ్యాయి. ఆకోవలోనే 9 నెలలు మోసి జన్మ ఇచ్చి ప్రాణం పోసిన తల్లి ఏమైందో ఏమోకానీ పసికందు భారమై వదిలించుకున్న సంఘటన తెలంగాణ సరిహద్దులోని నారాయణపేట జిల్లా కృష్ణ మండల రైల్వే స్టేషన్ లో శుక్రవారం తెల్లవారు జామున వెలుగు చూసింది. రైల్వే ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం…
పది రోజుల పసికందును, రైలు పట్టాల మూడో ప్లాట్ ఫారం, దగ్గర డ్రైనేజ్ పక్కన మహిళ, వదిలేసి పోయారు. కడుపులో పుట్టిన బిడ్డని, కనుపాపలా చూసుకోవాల్సిన తల్లి ఏమైందో ఏమో.! కానీ కర్కశంగా వదిలిపెట్టి వెళ్ళింది. శిశువు ఏడుపు విన్న స్థానికులు,రైల్వే పోలిస్ ముని, సకాలంలో పసికందను, అంబులెన్స్ లో వెంటనె హాస్పిటల్ కు తరలించడంతో పెను విషాదం తప్పింది. పుట్టిన పసికందును రైల్వే స్టేషన్ మూడో ప్లాట్ఫారం పక్కనున్న డ్రైనేజ్ కాలువలో ఎవరో వదిలేసి వెళ్ళి పోయారు. ర్తల్వే సిబ్బంది ఆ మగబిడ్డ సురక్షితంగా ప్రాణాలతో బయటపడేలా ఆడుకున్నారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అసలు ఆ బిడ్డను వదిలేసి వెళ్ళింది కన్నతల్లేనా? లేక మరెవరైనా ఈ ఘాతుకానికి ఒడిగట్టా రా? అనే కోణంలో పోలీసు లు విచారణ జరుపుతు న్నారు.. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం దారుణం. చైల్డ్ హెల్ప్ అధికారులకు, అప్పగిస్తామని పోలీస్ సిబ్బంది లు తెలిపారు.



