ఘనంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

గంభీరావుపేట జూలై 10(జనం సాక్షి); రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని అమరవీళ్ల స్థూపం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి మహేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పర్ష హనుమాన్లు మాట్లాడుతూ ఆయన దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పర్ష హనుమాన్లు, హమీద్, గ్రామ శాఖ అధ్యక్షులు, మెండే భాస్కర్, శ్రీనివాస్, నాయకులు నుస్రత్, భాస్కర్, శ్రీనివాస్ గౌడ్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు లక్కం నాంపల్లి, వేషాల వెంకటి, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు



