రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ పనుల పరిశీలన

రూ.19 కోట్లతో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచనలు

మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాలతో పనుల పురోగతిని పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

ఉప్పల్ /హబ్సీగూడ, జూలై 10 (జనంసాక్షి): ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ పనులను కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు హబ్సీగూడ డివిజన్ అధ్యక్షుడు కంది శ్రవణ్ కుమార్ రెడ్డి స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలిసి చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను సందర్శించారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కంది శ్రవణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఉప్పల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. మందుముల పరమేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు రామంతాపూర్ పెద్ద చెరువు అభివృద్ధి కోసం రూ.19 కోట్ల నిధులు మంజూరు కావడం హర్షణీయమన్నారు. మొత్తం 18.23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువు పరిసరాలను ఆధునికీకరించేలా సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిధులతో బతుకమ్మ కొలను, వాకింగ్ ట్రాక్, బహిరంగ వ్యాయామశాల, పచ్చదనం పెంపు, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించే ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. హైడ్రా ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ పనులతో ఎవరికీ నష్టం వాటిల్లదని, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించి, వేగంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఈ పనుల కోసం నిరంతరం కృషి చేసిన ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హబ్సీగూడ డివిజన్ నాయకులు రొండ్ల దామోదర్ రెడ్డి, ధర్మా నాయక్, మురళీకృష్ణ ముదిరాజ్, రాజు నాయక్, జావేద్, గుండు రాజన్న, మాలు నాయక్, వాసు నాయక్, వంగూరి నర్సింగ్ రావు, లక్ష్మీనారాయణ, సాయికుమార్, సుమన్ నాయక్, శివ, అనిల్ మామిడాల, ఉమేష్, రంజిత్ పాల్గొన్నారు. అలాగే రామంతాపూర్ డివిజన్ అధ్యక్షుడు సందీప్ పటేల్, శ్రీకాంత్ యాదవ్, జలీల్ పాషా, భాస్కర్, శాగ శ్రీధర్, గరిక సుధాకర్, అశోక్, సంధ్యారాణి, అంబికా గౌడ్, సచిన్, జంగయ్య, శ్యాముల్, మింటూ గౌడ్, చింటూ, శోభ, శ్రీలత, చైతన్యతో పాటు వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు నామ్ రాజిరెడ్డి, బాలయ్య బాబు, ఉపేందర్ రెడ్డి, సంపత్ తదితరులు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

తాజావార్తలు