హైదరాబాద్: ఎసిబి వలలో మరో అవినీతి చేప చిక్కింది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఎంవివీఐ)గా పనిచేస్తున్న శివలింగం ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. సరూర్‌నగర్‌లోని శివలింగం ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శివలింగం బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా శివలింగం పని చేస్తున్నారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలు శివలింగంపై ఉన్నాయి. సరూర్‌నగర్‌లో రెండు ఇళ్లను, ఉప్పల్ లో రెండు ఫ్లాట్లు, ఇంట్లో రెండు లక్షల రూపాయల నగుదును అధికారులు గుర్తించారు.