*ఎస్ జి టి ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలి*
కోదాడ అక్టోబర్ 11(జనంసాక్షి) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఓటు హక్కు లేకపోవడం దురదృష్టకరం, రాబోయే కాలంలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్ జి టి ఉపాధ్యాయులకు ఓటు వేసే అవకాశం కల్పించాలనీ టి పి టి ఎఫ్ కోదాడ మండల శాఖ అధ్యక్షులు మరియు ఎస్జీటీ ఉపాధ్యాయుడు బడుగుల సైదులు మంగళవారం నాడు కోదాడలో పత్రికా ప్రకటన ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.1950 ఎలిమెంటరీ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు పదవ తరగతి ఇంటర్మీడియట్ అర్హతతో ఎంపిక చేయబడేవారు వారికి విద్యారంగం ఉపాధ్యాయ సమస్యలపై అవగాహన శక్తి పరిష్కార సామర్థ్యాలు తక్కువ స్థాయిలో ఉంటాయని ఉద్దేశంతో కాబోలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించబడలేదు.కానీ నేడు ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఎస్ జి టి ఉపాధ్యాయులు డీఎడ్ తో పాటు బీఈడీ ఎంఈడి ఎంసీఏ ఏం ఫీల్ పిహెచ్డి ఉన్నత విద్యార్హతలు కలిగి ఉన్నారు. అధిక సంఖ్యలో ఉండి, సుదీర్ఘకాలం బోధన అనుభవంతో, విద్యా ఉపాధ్యాయ సమస్యలపై అవగాహన శక్తి సామర్థ్యాలను కలిగిన ఎస్ జి టి ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు కల్పించడం ద్వారా విస్తృతస్థాయిలో ప్రజాస్వామ్య విలువలు పెరుగుతాయి. ఆధునిక సాంకేతిక మారుతున్న కాల పరిస్థితుల దృష్ట్యా చట్టసావనాలు చేసి ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలని కోరుతున్నారు.