ఏఐఎస్ఎఫ్ ద్వారానే సమరశీల పోరాటాలు సాధ్యం
– ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు
చేర్యాలలో ఏఐఎస్ఎఫ్ కళాశాల కమిటీ ఎన్నిక
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 12 : ఏఐఎస్ఎఫ్ ద్వారానే విద్యార్థి సమరశీల పోరాటాలు సాధ్యమని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు అన్నారు. బుధవారం మండలంలోని పలు ప్రైవేట్ కళాశాలలలో నూతన కమిటీలను నియమించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ,రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై ఏఐఎస్ఎఫ్ గా విద్యారంగ సమస్యల పరిస్కారమే ద్యేయంగా కృషి చేస్తుందని విద్యార్థులకు పిలుపునిచ్చారు. 1936లో ఆవిర్భవించిన ఏఐఎస్ఎఫ్ చదువుతూ-చదువుకై పోరాడు అనే నినాదంతో శాంతి, అభ్యుదయం,శాస్త్రీయ సోషలిజం విద్యా విధానం లక్ష్యంగా పని చేస్తుందన్నారు. అనంతరం సాధన కళాశాల కమిటీ మహిళా విభాగం నుంచి శిరీష,నవ్యశ్రీ హాసిని, అంజలి, సమ్రీన్, భూష్రా, పురుషుల విభాగం నుంచి కృష్ణ ప్రసాద్, మునఫ్, కష్యాప్, సాయికుమర్, ప్రదీప్, ప్రశాంత్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ సుధీర్ఘ ఘన చరిత్ర కలిగిన సంఘంలో పని చేయడం సంతోషంగా ఉందన్నారు. కళాశాలలో ఎదుర్కొంటున్న సమస్యలను ఏఐఎస్ఎఫ్ గా పరిష్కారిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు ఆత్మకూరి హరికృష్ణ, గడ్డం ప్రవీణ్, రాజు, కనకరాజు విద్యార్థులు పాల్గొన్నారు.
Attachments area