ఏజెన్సలో అధిక దిగుబడి
రైతు ప్రదర్శన క్షేత్రం
గంగారం అక్టోబర్ 22 (జనం సాక్షి)
గంగారాం మండలంలోని కోమట్లగూడెం గ్రామం లో మొక్కజొన్న పంట ప్రదర్శన క్షేత్రం గంగా కావేరి సీడ్స్ వారి ఆధ్వర్యంలో. జికె (3122) మొక్కజొన్న పంట పై శనివారం ఉదయం ప్రదర్శన క్షేత్ర నిర్వహించారు ఈ సందర్భంగా కంపెనీ ఏరియా మేనేజర్ మధుకృష్ణ మాట్లాడుతూ జికె. 3122 మొక్కజొన్న రకం వర్షాకాలము మరియు యాసంగికి అనుకూలమైన విత్తనం గా పేర్కొనబడింది 3122 . పలురకాల తెగుళ్ళను తట్టుకునే శక్తి ఉందన్నారు.జి కె 3122 నారింజ రంగు కలిగి సన్నటి బెండు తో ఉంటుంది అన్నారు.ఇతర రకాలతో పోలిస్తే అధిక దిగుబడి ఉంటుందని చెప్పడం జరిగింది. గ్రామానికి చెందిన రైతు. సునారి స్వామి గారి పొలం లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతు సునారి స్వామి మాట్లాడుతూ మన భూములకు నీటి ఎద్దడిని తట్టుకొని అధిక దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను .ఇలాంటి విత్తనాన్ని ఇచ్చిన గంగా కావేరి సీడ్స్ కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమానికి గంగారం మండల చుట్టుపక్కల 8 గ్రామాల నుండి 250 మంది రైతులు పాల్గొన్నారు. ఈ క్షేత్ర ప్రదర్శనల్లో కొత్తగూడ డిస్ట్రిబ్యూటర్ సాయిరాం ట్రేడింగ్ కంపెనీ: జె. రామారావు
మరియు డీలర్ గంగారం ఆగ్రోస్ కృష్ణ మరియు ఓం సతీష్ రవి దుర్గం వేణు సతీష్ , రామదాసు,
ఏరియా మేనేజర్ మధుకృష్ణ మరియు టెర్రిట్టరీ మేనేజర్ శంకర్ మరియు కంపెనీ ప్రతినిధి మహేందర్ పాల్గొన్నారు.