ఏపీపీఎస్సీకి ఇచ్చిన జీవోలు ఉపసంహరించుకోవాలి
హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ 1 కేటగిరీ చేర్చి ఏపీపీఎస్సీకి జీవోలు ఇవ్వటాన్ని వెంటనే ఉపసంహరించాలని తెలంగాణా గెజిటెడ్ అధికార్లు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గ్రూప్1,గ్రూప్2 మార్పులపై ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి మిన్నీ వల్ల వెనుకబడిన ప్రాంత విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని వారు మాధ్యూకు వివరించారు. ఏపీపీఎస్సీకి ఇచ్చిన జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకుని గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో పాత విధానాన్నే కొనసాగించాలని, గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కూడా ఇంతకు ముందున్న విధంగానే నియామక ప్రక్రియ ఉండాలని కోరినట్లు చెప్పారు.