ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఈఈ వెంకటరమణ

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: కొల్లాపూర్‌ డిప్యూటీ ఈఈ వెంకటరమణ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. నాగర్‌కర్నూల్‌లో రూ. 13వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వెంకటరమణను పట్టుకున్నారు.