ఏసీబీ వలలో మర్రిగూడ మండల సర్వేయర్

రెవెన్యూ కార్యాలయంలో, ఇంటిలో కొనసాగుతున్న దాడులు

రైతు నుండి12000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రవి

మర్రిగూడ, ఫిబ్రవరి14,( జనంసాక్షి) ఏసీబీ వలలో మర్రిగూడ మండల సర్వేయర్ లావుడి రవి, ఏసీబీ సీఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం మర్రిగూడ మండలంలోని సారంపేట గ్రామానికి చెందిన ఓ రైతు సర్వే నెంబర్ 336 ఉన్న భూమిని సర్వే చేయడానికి 15 వేల రూపాయలను సర్వేయర్ లావుడి రవి డిమాండ్ చేశాడు, ఆ రైతు పన్నెండు వేలకు ఒప్పందం చేసుకొని ఏసీబీ అధికారులను సంప్రదించగా శుక్రవారం రెండు బృందాలుగా ఏర్పాటై సర్వేయర్ లావుడి రవి పై నిగా పెట్టగా మర్రిగూడ మండలం రెవెన్యూ కార్యాలయంలో రైతు నుండి 12 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు, తన స్వగ్రామం మిర్యాలగూడలో కూడా ఒక బృందం సర్వేయర్ లావుడి రవి ఇంటిపై దాడులు కొనసాగుతున్నాయి,నిందితుడైన అధికారిని అరెస్టు చేసి ఎసిబి కోర్ట్ నాంపల్లి , హైదరాబాద్ లో హాజరు పరుస్తారు, ఈ దాడుల్లో ఏసీబీ డిఎస్పి ఎం.జగదీష్ చంద్ర, సిఐలు రామారావు, వెంకట్ రావు, వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు,