ఏ పార్టీలో చేరను : నాగం జనార్ధన్‌రెడ్డి
వరంగల్: తాను ఏ పార్టీలో చేరనని, తెలంగాణ కోసం పోరాడుతానని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. నాగం భరోసా యాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నాగం మాట్లాడుతూ.. తెలంగాణలో పర్యటిస్తున్న చంద్రబాబు ఆత్మబలిదానాల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులే తన టార్గెట్ అని వారి నియోజకవర్గాల్లో పర్యటిస్తా అని చెప్పారు. వరంగల్ జిల్లా మంత్రుల నియోజకవర్గాల నుంచే తన పర్యటన ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.