ఐటిసి సహకారంతో ముంపు ప్రాంత ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన… విప్ రేగా, కలెక్టర్ అనుదీప్.

బూర్గంపహాడ్ జూలై  (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో బస్సప్ప క్యాంప్ కు చెందిన గోదావరి ముంపు ప్రాంత బాధిత కుటుంబాలకు ఐటిసి సహకారంతో అందించిన పలు రకాల నిత్యవసర సరుకులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రేగా కాంతారావు మాట్లాడుతూ గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు అండగా ఐటిసి వారు చేస్తున్న సేవలను గుర్తు చేసుకుంటూ నాడు కరోనా సమయంలో నేడు గోదావరి వరద ముంపు సమయంలో బాధితులకు అండగా నిలబడి నిత్యం 10 వేల మంది అన్నదానం చేయడం మాములు విషయం కాదని అన్నారు. ఐటిసి పిఎస్ పిడి పరిశ్రమ యాజమాన్యం సేవలు అమోఘమని హర్షం వ్యక్తం చేశారు. నాడు కరోనా సమయంలో మండల ప్రజలకు నిత్యవసర సరుకులతో పాటు, ప్రతి గ్రామ పంచాయతీలో శానిటేషన్ నిర్వహించడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయలు విరాళంగా అందించారన్నారు. నేడు గోదావరి ముంపు విపత్తు సమయంలో ప్రజలకు అండగా నిత్యం10వేల మందికి అన్నదానంతో పాటు త్రాగు నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నరన్నారు. సుమారు5 వేల మందికి పునరావసం కల్పించి, వరద బాధితులను ఆదుకోవాలని నేను కోరిన వెంటనే సానుకూలంగా స్పందించరన్నారు. ఈ విపత్కర పరిస్థితిలలో ఐటీసీ చేస్తున్న సేవలు ఎప్పటికీ మరువలేవని అన్నారు. నా నియెజకవర్గ పరిధిలో ఐటిసి పరిశ్రమ ఉండటం పేద మధ్యతరగతి కుటుంబాలు అదృష్టమని ఐటిసి యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. అనునిత్యం ప్రజలకు అండగా నిలుస్తున్న ఐటిసి సేవలను అభినందించారు. విపత్తుల సమయంలో ప్రజలకు అండగా మేము ఉన్నామని ఐటిసి యాజమాన్యం ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఐటిసి యాజమాన్యం నిత్యం స్థానిక అధికారులకు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ కావాల్సిన సౌకర్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధుల మన్ననలను పొందుతున్నరన్నారు.  ముంపు ప్రజలను తరలించే క్రమంలో రోడ్డు నిర్మాణ పనులు ఐటీసీ యాజమాన్యం దృష్టికి రాగానే వెంటనే పూర్తి చేయటమే కాకుండా సారపాక మేజర్ గ్రామ పంచాయతీలో సుమారు 2 కోట్ల రూపాయలు పైగా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు మంజూరు చేసారని కొనియాడారు. గోదావరి వరద ముంపుకు గురైన గ్రామాల్లో ఐటిసి చేస్తూ సేవలను అభినందనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐ టి సి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి విపత్కర పరిస్థితులలో గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చిన ఐటీసీ యాజమాన్యానికి వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గోదావరి వరద ముంపు ప్రాంత బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ముంపుకు గురైన ప్రతి ఇంటికి రూ.10 వేల రూపాయలు ఆర్థిక సహాయం,కుటుంబానికి రెండు నెలలపాటు 20 కిలోల బియ్యం తో పాటు పలు రకాల నిత్యాసర సరుకులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు గారు, బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఐటిసి యూనిట్ హెడ్ సిద్ధార్థ మహంతి, డీజీఎం హెచ్ఆర్ శ్యామ్ కిరణ్, ఐటిసి అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ చంగల్ రావు, ఐటిసి-టి ఎన్ టి యూ సి ప్రెసిడెంట్ కనకమేడల హరిప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, పి ఏ సి ఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి, టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, కోయగూడెం సర్పంచ్ తుపాకుల రామలక్ష్మి, టిఆర్ఎస్ సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను, పోడియం నరేందర్, జలగం చంద్రశేఖర్, బాలి శ్రీహరి, బెజ్జంకి కనకా చారి, తిరపతి ఏసుబ్, బండారు లక్ష్మీనారాయణ, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నాయకులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.