ఐటీ రంగానికి హైదరాబాదే కేరాఫ్
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్,డిసెంబర్,05(జనంసాక్షి):హైదరాబాద్ నగరం ఐటీ హబ్‌గా మారనున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మాదాపూర్‌లో యానిమేషన్ అండ్ గేమింగ్‌ను ప్రారంభించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ఐటీ రంగానికి చిరునామగా మారుస్తామన్నారు. . గేమింగ్, యానిమేషన్ స్టార్టప్ సంస్థలకు విస్తృత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఈ రంగాన్ని ఇక్కడ బలోపేతం చేస్తున్నామని అన్నారు. టీహబ్‌లో ఈ నెల 28న సత్య నాదెళ్ల స్టార్టప్‌లను పరిశీలిస్తారనిచెప్పారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడమే మా లక్ష్యం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో హైదరాబాద్‌లో ఇమేజ్ సెంటర్ ప్రారంభిస్తాం. ఈనెల 28న ఐటీ రంగానికి సంబంధించిన 4 కొత్త పాలసీలను ప్రారంభించనున్నట్లు తెలిపిన ఆయన దేశంలోనే హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరమని పేర్కొన్నారు. ఇక్కడ వాతావరణంతో పాటు అనేక అవకాశాలు కలసి వస్తాయన్నారు. విద్యుత్, నీటిసరఫరాల విషయంలో తీసుకున్నచర్యల కారణంగా అసలు సమస్య లేకుండా పోయిందన్నారు. ఇదిలావుంటే తెలంగాణ ఐటి మంత్రి , యువనేత కే.తారకరామారావుకు జాతీయస్థాయిలో మంచిగౌరవం దక్కింది. దక్షిణభారతదేశంలో అతిపెద్ద లైఫ్ స్టయిల్ మ్యాగజైన్ రిట్జ్ , ప్రముఖ ఛానల్ సిఎన్‌ఎన్-ఐబిఎన్ తో కలిసి కేటీఆర్ కు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రకటించింది.. మోస్ట్ ఇన్సిపిరేషన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కేటీఆర్ కు ఇస్తున్నట్లు తెలిపింది..ప్రజాజీవితంలో అద్బుతమైన పురోగతి, పాలనలో ఉత్తమ ప్రమాణాలు పాటిస్తూ తనకిచ్చిన ఐటి శాఖలో మంచి ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొంది..వీరిచ్చిన ఇతర అవార్డులకు నందన్ నీలేకని, జిఎంఆర్, సినీనటి విద్యాబాలన్ తదితరులున్నారు..