ఐసిసి వన్డే క్రికెటర్ అవార్డ్ రేసులో ధోనీ , కోహ్లీ
పీపుల్స్ ఛాయిస్‌లో పోటీపడుతోన్న సచిన్
దుబాయ్, ఆగస్టు 30: ప్రతిష్టాత్మకమైన ఐసిసి అవార్డుల రేసులో భారత సారథి ధోనీ , వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య పోటీ నెలకొంది. వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు వీరిద్దరూ పోటీపడుతున్నారు. వీరితో పాటు శ్రీలంక క్రికెటర్లు కుమార సంగక్కరా , లసిత్ మలింగా కూడా ఉన్నారు. వచ్చే నెలలో ప్రకటించనున్న ఐసిసి అవార్డుల షార్ట్ లిస్టును ఇవాళ విడుదల చేశారు. శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కరా టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఇయర్‌తో పాటు సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ రేసులో కూడా ఉన్నాడు. అతనితో పాటు సౌతాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా , ఫిలాండర్ , ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కూడా పోటీపడుతున్నారు. ఇక టీ ట్వంటీ అవార్డు విషయానికొస్తే… శ్రీలంక ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ , విండీస్ డాషింగ్ ప్లేయర్ క్రిస్ గేల్ , సౌతాఫ్రికా ఆటగాడు రిచర్డ్ లెవీతో పాటు లంక స్పిన్నర్ అజంతా మెండిస్ రేసులో ఉన్నారు.
ఇదిలా ఉంటే పీపుల్స్ ఛాయిస్ అవార్డు కోసం ఐదుగురు స్టార్ క్రికెటర్లు పోటీపడుతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ , దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్ కల్లిస్ , సఫారీ బౌలర్ ఫిలాండర్ , శ్రీలంక సీనియర్ ప్లేయక్ సంగక్కరాతో పాటు ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రేసులో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్లో అభిమానుల ఓటింగ్ ద్వారా ఈ అవార్డును ఎంపిక చేస్తారు. ఐసిసి ఈ ఏడాది 11 కేటగిరీలలో అవార్డులను అందజేయనుంది. ఐసిసి సెలక్షన్ ప్యానెల్ ఛైర్మన్ క్లైవ్ లాయిడ్ ఆధ్వర్యంలో ఐదుగురు మాజీ క్రికెటర్లు కలిసి షార్ట్ లిస్ట్‌ను ఎంపిక చేశారు. మాజీ శ్రీలంక ఆటగాడు ఆటపట్టు , ఇంగ్లాండ్‌కు చెందిన క్లేర్ కానర్ , విండీస్ కార్ల్ హూపర్ , ఆస్టేల్రియా ప్లేయర్ టామ్ మూడీ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఆటగాళ్ళతో పాటు ఐసిసి అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందజేస్తారు. ప్రస్తుతం టాప్ 10 టెస్ట్ జట్ల కెప్టెన్లు అంపైర్ అవార్డుకు వేసిన ఓటు ద్వారా విజేకను ఎంపికచేస్తారు. దీని కోసం ఐదు సార్లు విజేతగా నిలిచిన సైమన్ టౌఫెల్ , మూడు సార్లు అవార్డు గెలుచుకున్న అలీమ్ దార్ , న్యూజిలాండ్‌కు చెందిన బిల్లీ బౌడెన్ , శ్రీలంకకు చెందిన కుమారా ధర్మసేన , ఇంగ్లాండ్ రిచర్డ్ కెట్లే , ఆస్టేల్రియాకు చెందిన రూడ్నీ టక్కర్ రేసులో ఉన్నారు. ఐసిసి వార్షిక అవార్డుల కార్యక్రమం వచ్చే నెలలో శ్రీలంకలో జరగనుంది. ట్వంటీ ట్వంటీ ప్రపంచకప్ సందర్భంగా దీనిని అక్కడే నిర్వహిస్తున్నారు.
ఐసిసి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ః
హషీమ్ ఆమ్లా (సౌతాఫ్రికా)
మైకేల్ క్లార్క్ ( ఆస్టేల్రియా)
వెర్నాన్ ఫిలాండర్ (సౌతాఫ్రికా)
కుమార సంగక్కరా (శ్రీలంక)
ఐసిసి టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ః
హషీమ్ ఆమ్లా (సౌతాఫ్రికా)
మైకేల్ క్లార్క్ ( ఆస్టేల్రియా)
వెర్నాన్ ఫిలాండర్ (సౌతాఫ్రికా)
కుమార సంగక్కరా (శ్రీలంక)
ఐసిసి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ః
మహేంద్రసింగ్ ధోనీ ( భారత్ )
విరాట్ కోహ్లీ ( భారత్ )
లసిత్ మలింగా ( శ్రీలంక )
కుమార సంగక్కరా (శ్రీలంక )
ఐసిసి ట్వంటీ ట్వంటీ ఫెర్నార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ ః
దిల్షాన్ ( శ్రీలంక )
క్రిస్ గేల్ (వెస్టిండీస్)
రిచర్డ్ లెవీ ( సౌతాఫ్రికా )
అజంతా మెండిస్ (శ్రీలంక)
ఐసిసి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ ః
మహ్మద్ హఫీజ్ (పాకిస్థాన్)
జాక్ కల్లిస్ (సౌతాఫ్రికా )
డానియల్ వెటోరీ (న్యూజిలాండ్)
ఎబి డివీలియర్స్ (సౌతాఫ్రికా)
ఐసిసి పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ ః
జేమ్స్ ఆండర్సన్ ( ఇంగ్లాండ్ )
జాక్ కల్లిస్ ( సౌతాఫ్రికా )
వెర్నాన్ ఫిలాండర్ (సౌతాఫ్రికా )
కుమార సంగక్కరా ( శ్రీలంక )
సచిన్ టెండూల్కర్ ( భారత్ )
ఐసిసి వుమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ః
లిడియా గ్రీన్వే ( ఇంగ్లాండ్ )
అనీసా మహమ్మద్ ( వెస్టిండీస్ )
సారా టేలర్ ( ఇంగ్లాండ్ )
స్టెఫానీ టేలర్ ( వెస్టిండీస్ )
ఐసిసి ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ః
డగ్ బ్రేస్‌వెల్ ( న్యూజిలాండ్ )
దినేష్ చందిమాల్ ( శ్రీలంక )
సునీల్ నరైన్ ( వెస్టిండీస్ )
జేమ్స్ పాటిన్సన్ ( ఆస్టేల్రియా )
ఐసిసి అంపైర్ ఆఫ్ ది ఇయర్ ః
బిల్లీ బౌడెన్ ( న్యూజిలాండ్ )
ఆలీమ్ దార్ ( పాకిస్థాన్ )
కుమార ధర్మసేన ( శ్రీలంక )
రిచర్డ్ కెట్లే ( ఇంగ్లాండ్ )
సైమన్ టౌఫెల్ ( ఆస్టేల్రియా )
రూడ్నీ టక్కర్ ( ఆస్టేల్రియా )