ఒక్క అవకాశం ఇవ్వండి

-మీకు సేవకుడిగా పని చేస్తా -అభివృద్ధి చేసి చూపిస్తా..
టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
నాకు ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా అని తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో జరుగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా మునుగోడు మండలంలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అయన
మునుగోడు మండలం క్రిష్టా పురం,ఇప్పర్తి గ్రామాలలో జోరుగా ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచార కార్యక్రమంలో.. ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి వర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి లు పాల్గొన్నారు. మిత్ర పక్షాలు బలపర్చిన టీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు.
గ్రామ ప్రజానీకం అంతా బతుకమ్మలు, బోనాలతో కోలాటాలు, డప్పు,వాయిద్యాలతో బాణసంచా కలుస్తూ
ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రధాన దారులలో ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.గ్రామ ప్రజలు, నాయకులు కార్యకర్తలు మహిళలు ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెరాస పార్టీ నాయకులతో పాటు సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
తదనంతరం క్రిష్టాపురం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి,పలు సంఘాలకి సంబంధించిన పలువురు నేతలు తెరాస పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా మునుగోడు టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రాన్ని తెచుకున్నాం. 2014లో ఎమ్మెల్యే గా గెలిచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. 600 కోట్ల రూపాయల నిధులు తెచ్చిరోడ్లన్నీ మంచిగా చేసుకున్నాము.
ఈ ఉప ఎన్నికల్లో మరోసారి గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల ఋణం తీర్చుకుంటా. మునుగోడు ప్రాంతాన్ని, బాగు చేసుకుందాం,ఆగిపోయిన పనులను పూర్తి చేసి అభివృద్ధి చేసుకుందాం..అని అన్నారు.
ఆడబిడ్డలు నీళ్ల కోసం బిందెలు తీసుకొని రోడ్ల మీదకు వెళ్లకుండా, చౌటుప్పల్ లో మిషన్ భగీరథ పైలాన్ నిర్మించుకొని ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చాము. ప్రొరోసిస్ భారీ నుంచి ప్రజలను రక్షించడం జరిగింది.
ఈ మునుగోడు నుంచే మత రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపిని ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మునుగోడులో టిఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి అక్కలు, చెల్లెలు, అన్నలు తమ్ముళ్లు అందరికి చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్న ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, కోరారు.
దయచేసి మరోసారి అవకాశం ఇచ్చి, ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.