ఒప్పంద అధ్యాపకుల నియామకాలకు 23న ఇంటర్య్వూలు
శ్రీకాకుళం, జూలై 20: బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులకు సంబంధించి ఒప్పంద అధ్యాపకుల నియామకాలకు ఈ నెల 23న ఇంటర్య్వూలు నిర్వహిస్తున్నట్లు వర్శిటీ ప్రిన్సిపల్ ఆచార్య మిర్యాల చంద్రయ్య తెలిపారు. బొధనా సిబ్బంది కొంత మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో ఖాళీ ఏర్పడిన స్థానంలో ఒప్పంద పద్ధతిలో నియామకాలు చేపడతున్నామన్నారు. వీరిని సెమిస్టర్ అయిన తరువాత తొలగిస్తామని బొధనా సిబ్బందితో సంబంధం లేదని సెమిస్టర్‌లో నిర్ధేశిత పేపరు పూర్తిచేస్తే రూ. 7,500 నుంచి 10 వేల వరకూ ఇస్తామన్నారు. ఈ నియామకాలకు ఈ నెల 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఇంటర్య్వూ నిర్వహస్తామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు.