ఓటర్ నమోదు దరఖాస్తులను స్వయంగా పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి ,అక్టోబర్ 8.
మునుగోడు ఉప ఎన్నిక కోసం కొత్తగా ఓటు హక్కు నమోదు కోసం భారీ స్థాయిలో దరఖా స్తులు వచ్చిన సంగతి విదితమే. ఓ పక్క ఎన్నికల నిర్వహణ లో ఊపిరి సలపకుండా రాత్రింబవళ్ళు పని చేస్తున్న తహశీల్దార్ లు, మరో పక్క బి ఎల్ ఒ ల సహాయంతో ఇట్టి వేలాది దరఖా స్తులను విచారణ కావిస్తు, యుధ్ధ ప్రాతిపదికన పరిశీలిస్తూ, అర్హులైన ప్రతి వ్యక్తి కి ఓటు వేసే అవకాశం ను కల్పిస్తున్నారు. అయితే, ఉప ఎన్నిక యొక్క తీవ్రత దృష్ట్యా, జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్లు, ఆర్ డి ఓ లు స్వయంగా ఈ పక్రియను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. శనివారం చండూర్ లో రిటర్నింగ్ అధికారి కార్యాలయం లో చౌటుప్పల్, చండూర్, మునుగోడు మండలం లకు చెందిన ఓటు హక్కు నమోదు ధరఖా స్తులను, జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించారు. అనర్హుల దరఖాస్తులను తిరస్కరించారు. కొత్తగా పెళ్లి అయి వచ్చిన కొత్త కోడళ్ళు, జనవరి 1, 2022 నాటికి 18 సంత్సరాలు దాటి, కొత్తగా ఓటు నమోదు కు ధరఖా స్తు చేసిన వారినీ మాత్రమే ఓటు నమోదుకు అంగీకరించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా, ధరకాస్తు లను, పునః విచారణ చేస్తుండటం తో , రెవెన్యూ ఉద్యోగులు, BLO లు కూడా తగు జాగ్రత్తగా ఓటర్ నమోదు దరఖాస్తులను పరిష్కారం చేస్తున్నారు.జిల్లా కలెక్టర్ తో పాటు నల్గొండ అర్.డి. ఓ.జయచంద్రా రెడ్డి కూడా ఉన్నారు.
Attachments area