ఓటు హక్కు పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. – జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

గద్వాల నడిగడ్డ, నవంబర్ 11 జనం సాక్షి.
ఓటు హక్కు ఆయుదమని, ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని , ప్రజలందరూ ఓటు హక్కు పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. .
శనివారం సాధారణ ఎన్నికలలో సందర్బంగా ఓటు హక్కు వినియోగంపై ప్రజలలోపూర్తి అవగాహన కల్పించేందుకు స్వీప్ కార్యక్రమాలలో భాగంగా గద్వాలలోని రాజీవ్ మార్గ్ లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ యూనిట్, వివి ప్యాట్ మోడల్ లను ప్రారంభించారు. ఐ డి ఓ సి కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన ఐ ఓటు ఫర్ సూర్ అనే సెల్ఫీ పాయింట్ ను అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగo కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు కచ్చితంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఓటు యొక్క ఆవశ్యకతను వివరిస్తూ ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాఆయుధమని ఓటు వేయడం ద్వారా మంచి ప్రతినిధి ని ఎన్నుకోవచ్చని అన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యత ప్రతి ఒక్కరు తెలుసు కోవాలని, ఎన్నికల్లో ఎలాంటి ధన, ప్రలోభాలకు లొంగకుండ స్వేచ్చా యుతంగా ఓటు ను వినియోగించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, స్వీప్ నోడల్ అధికారి రమేష్ బాబు, డిపిఆర్ఓ చెన్నమ్మ, ఎం.ఆర్ ఓ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.