ఓయూలో కొలిమంటుకుంటున్న జాడ
అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల ర్యాలీ
షషమళ్లీ పేలిన భాష్పవాయుగోళాలు.. భగ్గుమన్న వర్సిటీ
హైదరాబాద్, జూలై 19 : ఓయులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు కొందర్ని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నందుకు నిరసనగా నేతలను అడ్డుకునేందుకు గాను చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఓయు విద్యార్థులు గురువారంనాడు తలపెట్టారు. అందులో భాగంగా ఉస్మానియా క్యాంపస్‌లోని ఆర్ట్స్ కళాశాల నుంచి ర్యాలీగా అసెంబ్లీకి బయల్దేరారు. టి.కాంగ్రెస్ ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనవద్దని, జై తెలంగాణ, ప్రణబ్ తెలంగాణ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. అయితే ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులను ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సంఘం నేత పిడమర్తి రవి, మరికొందర్ని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. దీంతో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఉద్రిక్తత కొనసాగుతోంది.