ఓసిపి పేలుళ్ల తో కూలిన ఇళ్లు
ఇంటిని పరిశీలించి న్యాయం చేస్తామన్న తహసీల్దార్
మల్హర్, జనంసాక్షి
ఓసిపి పేలుళ్ల ధాటికి డేంజర్ జోన్లోని ఇండ్లు కూలుతున్నాయి. మంగళవారం మండల కేంద్రమైన తాడిచర్ల లోని ఓసిపి మైన్ బ్లాస్టింగ్ ధాటికి రావుల రమేష్ కు చెందిన ఇంటి గోడలు ఒక్క సారిగా కూలిపోయి పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ జివాకర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. నిరుపేద కుటుంబానికి చెందిన రావుల రమేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని బ్లాస్టింగ్ పేలుళ్ల వల్ల తమ ఇంటి గోడలు బీటలు వారి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కు మంటూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నమని ఓసిపి వల్ల వెదజల్లే దుమ్ము ధూళి వల్ల అనేక రకాల రోగాలకు గురవుతున్నామని డేంజర్ జోన్లోని గృహాల సేకరణకు పిఎన్ ప్రకటన జారీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్వాసితులు జిల్లా కలెక్టర్ కు ఆర్డీవో కు తహసీల్దార్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న పలువురి ఇండ్లను తహసీల్దార్ పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట ఆర్ఐ సరిత, సర్వేయర్ ప్రభాకర్, భూ నిర్వాసితుల కమిటీ ఉపాధ్యక్షుడు బండి రాజయ్య, ఎంపిటిసి సభ్యులు రావుల కల్పన మొగిలి, వార్డు సభ్యులు బండి స్వామి నిర్వాసితులు అర్ని సత్యనారాయణ, బొబ్బిలి రమేష్, రావుల ఆంజనేయులు, గుమ్మడి రవి, ఓదక్క, సాంభలక్ష్మి, మల్లక్క, బానయ్య, తదితరులు ఉన్నారు.
2 Attachments • Scanned by Gmail