ఓ వివాహితపై కాల్పులు
తిరుపతి, జూలై 10 :ఒక వివాహితపై ఉన్మాది జరిపిన కాల్పుల ఉదంతం చిత్తూరు జిల్లాలో మంగళవారంనాడు కలకలం రేపింది. పీలేరు మండలం బలిజపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తనను తిరస్కరించిందనే కోపంతో అమర్ అనే వ్యక్తి ఆమెపై నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో బంధువులు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అమర్, మరొక వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.