కంటోన్మెంట్‌పై తెరాస జెండా
భాజాపా, కాంగ్రెస్‌లకు షాక్
ఇవే ఫలితాలు జీహెచ్‌ఎంసీలో పునరావృతం అవుతాయి
మంత్రుల ధీమా
హైదరాబాద్,జనవరి13(జనంసాక్షి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయ ఢంకా మోగించింది. ఎనిమిది వార్డులకు గానూ నాలుగు వార్డుల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఇద్దరు టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థులు కూడా గెలుపొందారు. దీంతో టిఆర్‌ఎస్ హవా చాటినట్లయ్యింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. 8 వార్డుల్లో నాలుగు తెరాస గెలుచుకోగా, రెండింటిలో తెరాస తిరుగుబాటు అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు చెరో వార్డులో విజయం సాధించారు. అలాగే గెలుపొందిన ఇద్దరు అభ్యర్తులు కూడా టిఆర్‌ఎస్‌కే మొగ్గు చూపితే మొత్తం ఆరు స్థానాలు టీఆర్‌ఎస్‌కే వచ్చినట్లు అవుతుంది. ఇద్దరు టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థులు కూడా తాము టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఆరు స్థానాలు టీఆర్‌ఎస్ ఖాతాలోకి రాగా, మిగతా రెండింటిలో ఒక వార్డులో కాంగ్రెస్ విజయం సాధించగా, మరొక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మొదటి వార్డులో టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. రెండో వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి కేశవరెడ్డి విజయం సాధించారు. మూడో వార్డులో టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి అనితా ప్రభాకర్ విజయ సాధించారు. నాలుగో వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి నళినీ కిరణ్ ,ఐదో వార్డులో స్వతంత్ర అభ్యర్థి రామకృష్ణ ,. ఆరో వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి పాండు యాదవ్ , ఏడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి భాగ్యశ్రీ విజయం సాధించారు. ఈ విజయం టిఆర్‌ఎస్ బలిమిని చూపిందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ ఫలితాలు ఆయనకు ఉత్సాహం వచ్చాయి. సనత్ నగర్ లో తేల్చుకుందామని అంటునన తెలుగుదేశం పార్టీకి ఇది సమాధానం అని శ్రీనివాసయాదవ్ అన్నారు.సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తన సత్తా చూపించామని ఆయన చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని తలసాని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఏజెంట్ల సత్తా బయటపడిందని తలసాని వ్యాఖ్యానించారు.కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టే గెలిచిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈమేరకు ఆయన విూడియాతో మాట్లాడుతూ తమపార్టీ అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను నెరవేరుస్తామన్నారు.
భాజాపా, కాంగ్రెస్‌లకు షాక్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, ఎమ్మెల్యే సాయన్నలకు చుక్కెదురైంది. అలాగే కొన్నిచోట్ల టిఆర్‌ఎస్‌కు కూడా భంగపాటు తప్పలేదు. రెండో వార్డులో సర్వే సత్యనారాయణ కూతురు సుహాసిని డిపాజిట్ గల్లంతైంది. 5వ వార్డులో సర్వే కుమారుడు నవనీత్ ఓటమి పాలయ్యాడు. 4వ వార్డులో ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిని ఓటమి చవిచూసింది. అయితే 8 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఆరు వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. కంటోన్మెంట్ ఎన్నికల్లో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే సాయన్నకు ఎదురుదెబ్బ తగిలింది. 4 వ వార్డు పికెట్ లో పోటీ చేసిన సాయన్న కూతురు లాస్య నందిత ఓటమి పాలైయ్యారు. లాస్య నందితపై 844 ఓట్లతో టీఆర్‌ఎస్ అభ్యర్థి నళిని కిరణ్ విజయం సాధించారు. ప్రకటించిన ఫలితాల్లో 2 వార్డులు టీఆర్‌ఎస్, 2 వార్డులు టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ కుమార్తె సుహాసిని ఓటమి పొందారు. 2వ వార్డు రసూల్ పురలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సుహాసినిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి సదాకేశవ రెడ్డి గెలుపొందారు. సుహాసిని పై సదాకేశవ రెడ్డి 1534 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 1వ వార్డులో టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గెలుపొందారు. కంటోన్మెంట్ 8 వార్డులకు 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలను అధికార పార్టీ టీఆర్‌ఎస్ సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కంటోన్మెంట్ ఎన్నికల్లో మరో టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి గెలుపొందారు. 3 వార్డు కార్ఖానాలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి జంపన విద్యావతిపై 2500 ఓట్ల ఆధిక్యంతో టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి అనితా ప్రభాకర్ విజయం సాధించారు. 1 వ వార్డులో టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి మహేశ్వర రెడ్డి గెలుపొందారు. టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి జక్కుల మహేశ్వరరెడ్డి గెలుపొందారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి జంపన ప్రతాప్ పై 616 ఓట్ల ఆధిక్యంతో మహేశ్వర రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది.