కందుల కొనుగోలుకు చర్యలు

3

– మంత్రి హరీశ్‌ భరోసా

హైదరాబాద్‌ ,ఫిబ్రవరి 27(జనంసాక్షి): రాష్ట్రంలో కంది రైతులను ఆదుకోవడంపై మంత్రి హరీశ్‌ రావు ప్రత్యేక దృష్టి సారించారు. వడగండ్ల వాన కారణంగా పంట నష్టపోయిన అన్నదాతకు అండగా నిలిచేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌ సింగ్‌ కు ఆయన లేఖ రాశారు. కందుల కొనుగోలు, ఇతర సమస్యలను అందులో ప్రస్తావించారు. మార్క్‌ ఫెడ్‌ ద్వారా ఎఫ్‌ సీఐ యుద్ధ ప్రాతిపదికన కందులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌ రావు కోరారు. తెలంగాణలో రైతులు సంప్రదాయక పంటలతో పాటు.. వాణిజ్యపంటలు కూడా పండిస్తున్నారని తెలిపారు. ప్రకృతి సహకరించకపోవడంతో అన్నదాతలు కష్టాలు పడుతున్నారని.. వారిని ఆదుకోవాల్సిన అవసరముందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ధరల స్ధిరీకరణ నిధి నుంచి.. నామ్‌ ఫెడ్‌, ఎఫ్‌ సీఐ సంస్థల ద్వారా కందులు కొనుగోలు చేయాలని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో మార్క్‌ ఫెడ్‌ ద్వారా కందులు కొనుగోలు చేశారని తెలిపారు. ఇప్పటిదాకా నామ్‌ ఫెడ్‌ ద్వారా 3490 మెట్రిక్‌ టన్నులు, ఎఫ్‌ సీఐ ద్వారా 7400 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారని వివరించారు. రాష్ట్రానికి సంబంధించి 5000 మెట్రిక్‌ టన్నుల కందులను కొనుగోలు చేయాలని కేంద్రం ఆదేశించిందని? అయితే ఏపీలో కంది పంట లేనందున ఆ టార్గెట్‌ కూడా కలిపి తెలంగాణ నుంచి 7400 మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేశారని తెలిపారు. అయితే ఇకపై కందులను కొనుగోలు చేయవద్దని ఎఫ్‌ సీఐ? టీఎస్‌ మార్క్‌ ఫెడ్‌ కు ఆదేశించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అభ్యంతరకరమైన విషయమని హరీశ్‌ రావు పేర్కొన్నారు.

ఇక? ఆదిలాబాద్‌ జిల్లాలో 3500-4000 మెట్రిక్‌ టన్నుల దాకా కందులు ఇంకా రైతుల దగ్గరే ఉన్నాయని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఎఫ్‌ సీఐ నిర్ణయం వల్ల కందులు పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల శ్రేయస్సు ను దృష్టిలో పెట్టుకొని టీఎస్‌ మార్క్‌ ఫెడ్‌ ద్వారా కందులను కొనుగోలు చేసేల చర్యలు తీసుకొవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి 4000 మెట్రిక్‌ టన్నుల కందులు సేకరించే అవకావం ఉందని? అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. 2016 మార్చి చివరి వరకు కందుల సేకరణ పొడగించాలని హరీశ్‌ రావు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, కందుల కొనుగోలు అంశంపై మంత్రి హరీశ్‌ రావు? కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ కార్యదర్శితో ఫోన్‌ లో చర్చించారు. టీఆర్‌ ఎస్‌ ఎంపీలతో కూడా మాట్లాడిన మంత్రి? కావాల్సిన చర్యలు తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలంలో జరిగిన సామూహిక ఆత్యాచార ఘటనపై పోలీస్‌ ఉన్నతాధికారులతో మాట్లాడిన మంత్రి ఈటల రాజేందర్‌ గారు.

దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని ఆదేశించిన మంత్రి ఈటల రాజేందర్‌ గారు నిందితులపై నిర్బయ యాక్ట్‌ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించిన మంత్రి సామూహిక ఆత్యాచారం సంఘటన గురించి తెలియగానే వెంటనే ఎస్పీతో మాట్లాడిన మంత్రి ఈటల రాజేందర్‌ గారు ఈ కేసుకు సంబందించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఎస్పీని ఆదేశించిన మంత్రి ఈటల రాజేందర్‌ గారు. జిల్లాలో ఎక్కడా ఇటువంటి సంఘటనలు జరక్కుండా మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీని ఆదేశించిన మంత్రి తమపై జరిగిన అన్యాయాలను మహిళలు నిర్బయంగా పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితులు కల్పించాలని మంత్రి ఎస్పీని ఆదేశించారు.

ఇదిలావుండగా  కందుల కొనుగోళ్లలో అధికారులత తీరుపై తెలంగాణ అటవీ, పర్యాటక శాఖ మంత్రి జోగు రామన్న మండిపసడ్డారు. వెంటనే ఆయన మంత్రి హరీష్‌ రావుతో మాట్లాడి తక్షణం రైతుల వద్ద ఉన్న కందులను కొనుగోలు చేయాలన్నారు. అలాగే అకాల వర్షానికి తడిసిన కందులను కూడా కొనుగోలు చేయించాలన్నారు.  ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డును శనివారం మంత్రి సందర్శించారు. తడిచిన కందులన్నింటినీ మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తామని హావిూ ఇచ్చారు. కందులకు కోతలు లేకుండా పూర్తి ధర చెల్లిస్తామన్నారు. కందుల అక్రమ కొనుగోళ్లపైజాయింట్‌ కలెక్టర్‌తో విచారణ జరిపించనున్నట్లు వెల్లడించారు. అక్రమ కొనుగోళ్లు జరిపిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాపారుల నుంచి అధికారులు లోపాయికారి కొనుగోళ్లకు పాల్పడ్డారని రైతులు ఆరోపించిన నేపథ్యంలో జెసితో విచారణకు ఆదేవించారు. కందులను కొనుగోలు చేయాలని గత నాలుగు రోజులుగా రైతులు ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులోనే పడిగాపులు కాస్తున్నారు. కందుల కొనుగోళ్ల లక్ష్యం పూర్తయిందంటూ ఎఫ్‌సీఐ అధికారులు కొనుగోళ్లకు రావడంలేదు. దీంతో రైతులు మార్కెట్‌లోనే పడిగాపులు కాస్తున్నారు. వ్యాపారుల నుంచి లోపాయికారి కొనుగోళ్లు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. కందుల కొనుగోళ్లపై మార్కెట్‌ యార్డు అధికారులతో ఉన్నతాధికారులు చర్చలు నిర్వహించారు. దీంతో కందలును యార్డుల్లో వేసిన సమయంలోనే అకాల వర్షంతో పూర్తిగా తడిసి పోయాయి. దీంతో గురుచుట్టునై రోకటిపోటులా తయారయ్యింది. రైతులను కలిసిన మంత్రి వారికి భరోసా కల్పించారు. ఆదిలాబాద్‌ మార్కెట్‌లో కందులను అమ్మేందుకు నాలుగు రోజులగా రైతులు పడిగాపులు పడుతున్నారు. కొనుగోళ్లలో సవాలక్ష ఆంక్షలు పెట్టి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్న అధికారులు, గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారుల నుంచి చేస్తున్న కొనుగోళ్లను అడ్డుకొని ఆందోళనకు దిగారు. వాణిజ్యపరమైన కొనుగోళ్లను చేపట్టిన ఎఫ్‌సీఐకి నిర్దేశించిన లక్ష్యం పూర్తి కావడంతో శుక్రవారం నుంచి కొనుగోలు చేయడం లేదని ప్రకటించారు. అప్పటికే రెండు రోజుల నుంచి వేలాది క్వింటాళ్ల కందులు అమ్మకం కోసం వచ్చి ఉన్నాయి. ఆయా రైతులకు మార్కెట్‌ అధికారులు టోకెన్‌ కూడా ఇచ్చారు. కొంత ఆలస్యమైనా కొనుగోలు చేస్తారనే ఆశతో ఎదురుచూస్తున్న  తరుణంలో లక్ష్యం పూర్తయిందని అధికారులు చెప్పడంతో రైతులు గొడవకు దిగారు. వ్యాపారుల నుంచి ఇష్టారాజ్యంగా కొనుగోలు చేయడం వల్లనే ఇప్పుడు రైతులు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రెండు రోజులుగా రైతులు తీసుకొచ్చిన కందులు బాగా లేవని, నాణ్యత లేవని సాకులు చెబుతూ, గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు.  కొనుగోళ్లు ప్రారంభం అయినప్పటినుంచి వ్యాపారులతో కుమ్మకై వారికి చెందిన కందులను కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రికి ఫిర్యాదుచేశారు.మార్కెట్‌లో అమ్మకానికి ఎదరుచూస్తున్న రైతులు శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షంతో మరింత నష్టపోయారు. అసలే అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటే, అమ్మకానికి తీసుకువచ్చిన కందులు కాస్తా తడిసిపోవడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. మంత్రి ఇచ్చిన హావిూ మేరకు తక్షణం కొనుగోళ్లు జరిపించాలన్నారు.