ముంబైలో భారీ వముంబైలో భారీ వర్షంర్షం

 

 

 

ఆగష్టు 16(జనం సాక్షి)మహారాష్ట్ర ముంబై ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షానికి ముంబైలోని విఖ్రోలిలో వర్ష నగర్‌ ప్రాంతంలోని జన్కళ్యాన్‌ సొసైటీలో శనివారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి భారీగా మట్టి, రాళ్లు ఓ గుడిసెపై పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. తెల్లవారుజామున 2:39 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ముంబై అగ్నిమాపక దళం స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ఇక భారీ వర్షానికి సియోన్‌, కుర్లా, చెంబూర్‌, అంధేరి సహా నగరం మొత్తం జలమయమైంది. సియోన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోకాలి లోతులో నీరు నిలిచిపోయింది. వెస్ట్రన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. భారీగా వర్షపు నీరు చేరడంతో అంధేరి సబ్‌వేని అధికారులు మూసివేశారు. విఖ్రోలిలో 21 గంటల్లో 248.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలకు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. పలు విమానాలు ఆలస్యం కాగా, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. మరోవైపు భారత వాతావణ శాఖ ముంబై నగరానికి అలర్ట్‌ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ముంబై, రాయ్‌గఢ్‌లకు రెడ్‌ అలర్ట్‌ ఇచ్చింది.