దోపిడీ దొంగల ముఠా అరెస్ట్
రాయికల్ ఆగస్టు 16(జనం సాక్షి ):
పోలీసుల అదుపులో ముగ్గురు నేరస్తులు
12 తులాల బంగారం, ఒక్క కారు, 15000 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘు చందర్
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, మరియు ఎస్సై సుధీర్ రావు సిబ్బంది తో కలిసి రాయికల్ లో ని లలిత ఆలయ సమీపంలో దొంగల ముఠాను అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ రఘు చందర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాయికల్ పోలీస్ స్టేషన్లో ఆరు కేసులకు సంబంధించిన 12 తులాల బంగారం, 15000 నగదు, మూడు మొబైల్ ఫోన్లను మరియు నేరాలకు ఉపయోగించిన ఐ-20 కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వ్యక్తులు జగిత్యాల, రాయికల్, మల్యాల, భూపాలపల్లి, భద్రాచలం, మరియు పరిసర ప్రాంతాలలో దొంగతనాల ముఠాపై 30కి పైగా కేసులు ఉన్నాయని మీడియా సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. ఈ దోపిడీలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసు సిబ్బంది, రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్, ఎస్‌ఐలు సుధాకర్, సుధీర్ రావు, పోలీసు సిబ్బంది హెచ్‌సి గంగాధర్, సుమన్‌లను జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ సత్కరించి నగదు ప్రదానం చేశారు.