కంద పద్య శాసన నమూన కరీంనగర్‌ లో ఆవిష్కరించాలి

పొద్దు పొడుపు కంద పద్య శాసన నమూనా కరీంనగర్‌లో ఆవిష్కరించాలె కరీంనగర్‌ పట్టణా న్ని అందంగా తీర్చిదిద్దే పనిలో ఉన్న అధికార యంత్రాంగానికి ఈ కాలమ్‌ ద్వారా ఒక సూచన చేయదలచాను. తొలి వెలుగు కంద పద్యం లిఖించబడ్డది కరీంనగర్‌లో జిల్లాలో. క్రీ.శ 946లో జనవల్లభుడు ఈ శాసనాన్ని వేయిం చాడు. ఈ శాసనం గంగాధర మండలంలోని కురిక్యాల,కొండన్నపల్లి గ్రామాల మధ్య గల బొమ్మలమ్మ గుట్ట మీద ఉన్నది. జనవల్లభుడు కన్నడ ఆది కవి పంపన సోదరుడు. ఈ శాసనం సంస్కృత, కన్నడ, తెలుగు భాషలలో గద్య పద్మా త్మకంగా ఉంది. ఈ శాసనంలో తెలుగు కంద పద్యాలు నన్నయ్య రచన కంటే పూర్వానివి. ఈ తొలి తెలుగు కంద పద్యం తెలుగుకు ప్రాచీన హోదా లభించేందుకు ఆధారమైన హేతువుల్లో ఒకటైంది. కంద పద్యం శాసనం మీద అందమైన జైన చక్రేశ్వరి విగ్రహం ఉన్నది. ఇంతటి ప్రశస్తి గల శాసనం యొక్క ప్రతీక రెప్లికాను కరీంనగర్‌ పట్టణంలో ని ఏదైనా చౌరస్తాలో ప్రతిష్టిస్తే తెలుగు సాహిత్య శాసన చరిత్రను గౌరవించినట్లు అవుతుంది.

ఇదే విధంగా ‘తరువోజ’ పద్య శాసనం యొక్క నమూనాను ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో అక్కడి అధికార యంత్రం గాం ఏర్పాటు చేశారు. దాని నమూనాలోనే కరీం నగర్‌లో కంద పద్య శాసన నమూనాను ఏక్కడై నా ఏర్పాటు చేస్తే అద్భుతమైన కరీంనగర్‌ చరి త్రను ప్రజలకు అందుబాటులో తెచ్చినట్టు అవు తుంది. ఆ శాసనం యొక్క అచ్చులను మరొక లోహంతో అచ్చం తయారు చేసే నిపుణులు ఉన్నారు.

కోటిలింగాల శాతవాహనుల రాజ ధాని నగరంగా విల్లసిల్లింది. దురదృష్టవశాత్తు కోటిలింగాల ఎల్లంపల్లి ప్రాజెక్టులో మునిగి పోనున్నది. దీని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కవులు, రచయితలు, మేధావులు మేల్కొని విన్నపాలు చేయడం వల్ల కాస్తా ఆగినట్లు కనిపిస్తుంది. ఇక్కడ లభించిన నాణేల ఆధారంగా ఇది క్రీ.పూ 6-5 శతాబ్దాల నాటి మొహంజోదార నాగరిక పట్టణం గా రూపొందినట్లుగా చరిత్రకారులు తేల్చుతున్నారు. ఎల్లంపల్లి ముంపు నుంచి కోటి లింగాలను ముంపును రక్షించాల్సి ఉంది. కరీం నగర్‌ జిల్లాలో పెద్ద బొంకూరు, దూళికట్ట, కదం బపూర్‌, పొట్లపెల్లి ప్రాంతాలు చారిత్రక ఆనవాళ్లుగా కన్పిస్తాయి. వీటన్నింటిపట్ల రక్షణ, అభివృద్ది చేపట్టడంలో ప్రజాప్రతినిధుల వైఫల్యం కంటే అవగాహన, చైతన్యం లేదని చెప్పవచ్చు.

కరీంనగర్‌లో రోడ్ల వెడల్పు కార్యక్ర మంను అధికార యంత్రాంగం పట్టుదలతో చే స్తూ ప్రజలకు సౌకర్యం కల్గచేస్తుంది. అందులో భాగంగానే కొత్తగా వెలుస్తున్న చౌరస్తాల్లో ఈ ప్రాంతంలో పలు రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన రాజకీయ, సామాజిక, తాత్విక రంగాల్లో ప్రము ఖలైన విగ్రహాలను చారిత్రక విశిష్టతగల నమూ నాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. కరీంనగర్‌ జిల్లాకే గర్వకారణమైన భారత మాజీ ప్రధాని, తెలంగాణ వైతాళికుడు పీివీ నరసింహారావు విగ్రహాన్ని ఒక ప్రధాన చౌరస్తాల్లో లేదా బస్టాండ్‌ దగ్గరలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే కరీంనగర్‌ కు చెందిన ప్రఖ్యాత న్యాయమూర్తి ,నిజాం కాలంలో అంతర్జాతీయ గుర్తింపు పొం దిన జస్టిస్‌ కుమారయ్య, కొమరంభీం చరిత్రను వెలికి తీసి నవలగా అందించి ,గోండు భాషకు అక్షరాలు సమకూర్చిన సాహు (శనిగరం వెంక టేశ్వర్లు), సినిమా రంగం నుంచి బీయస్‌ నారా యణ ఇట్లాంటి వాళ్ల విగ్రహాల ఏర్పాటును పరి శీలిస్తే బాగుంటుంది.

సమాజంలో అభివృద్ధి అంటేనే రోడ్లు,భవనాలు కట్టడాలు మిగిలిపోతున్న ఈ రోజుల్లో మనిషి ఆత్మగౌరవంతో నిలబడే విధంగా చారిత్రక, సాంస్కృతిక వారసత్వన్ని కాపాడుకునే దృష్టితో రాజకీయ నాయకులు కృషి చేస్తే బాగుం టుంది. చాలా సందర్భల్లో సంస్కృతిని, చరిత్రను, సాహిత్యాన్ని పోషించే ధర్మం తమది కానట్టుగానే ప్రభుత్వాలుంటాయి, ప్రజప్రతినిధులూ ఉంటారు. తెలంగాణ ప్రాంతంలో సంస్కృతి చరిత్ర పుష్కలం గా ఉన్నా దాన్ని పరిరక్షించే పట్టంపు లేకపోవడం వల్ల మరుగున పడుతున్నది. ఆంధ్రా ప్రాంతం లోని రాజకీయ నాయకులు ఇందుకు భిన్నంగానే ఉంటారు. అక్కడ కొంత సాహిత్య పోషణ జరుగు తుంది. జాతీయస్ధాయి సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలు, సభలు నిర్వహించేందుకు రచయిత లను ప్రోత్సహించే ఉద్దేశం, ఆచరణ కన్పిస్తది. ఈ పద్ధ్దతి ఇంకా కర్నాటక ,తమిళనాడు రాప్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. కాని మన దగ్గర శూన్యం.

రాజకీయ, సామాజిక వాతావరణం లో విగ్రహాల ఏర్పాటుగానీ దేనికైనా పేర్లు పెట్ట డం కానీ సమాజంలో అన్ని రంగాల్లోని వి శిష్ట వ్యక్తులను పరిగణలోకి తీసుకోవాలి.ఫక్తు రాజ కీయ నాయకులవే ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మన సాంస్కృతిక, సామాజిక రంగా న్ని ప్రభావితం చేసిన వారందరి గురించి ఆలో చించాలి. ఎంచి తీసుకోవాలి. రామన్న రోజు ల్లో కరీంనగర్‌కు ప్రతిష్టాత్మకమైన బొమ్మలమ్మ గుట్ట లోని కంద పద్య శాసన నమూనా ఏర్పాటు చేసే దిశలో ప్రజాప్రతినిధులు, అధికార యం త్రాం గం, రాజకీయ ప్రముఖులు, పౌర స్వచ్ఛంద సం స్థ్ధల ప్రతినిధులు ఆలోచన చేస్తారని ఆశిస్తాను.

అన్నవరం దేవేందర్‌