సభ సజావుగా సాగేలా సహకరించండి
` అఖిలపక్ష భేటీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
` ప్రతిపక్షాలు లేవనెత్తిన డిమాండ్లపై కేంద్రం సానుకూలం
` లోక్‌సభలో నిరసనలకు బ్రేక్.. !
న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి విపక్షాల నిరసనలతో ఉభయ సభలు స్తంభిస్తూనే ఉన్నాయి. బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్)పై ప్రతిపక్షాలు ప్రతిరోజూ ఆందోళన చేస్తుండటంతో సభలు వరుసగా వాయిదా పడుతున్నాయి. శుక్రవారం కూడా ఉభయసభల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఈనేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేడు తన ఛాంబర్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా సభ్యులంతా సహకరించాలని స్పీకర్ కోరారు. సోమవారం నుంచి ‘ఆపరేషన్ సిందూర్ ’పై చర్చ జరిపేందుకు కేంద్రం అంగీకరించింది. దీనిపై ప్రతిపక్షాలు లేవనెత్తిన కొన్ని డిమాండ్లపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కేంద్రం, ప్రతిపక్ష నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో సోమవారం నుంచి లోక్‌సభ కార్యకలాపాలు సజావుగా జరగనున్నట్లు తెలుస్తోంది. పాక్ ఉగ్రవాద స్థావరాల మీద మన సైన్యం ఇటీవల విజయవంతంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై పార్లమెంటులో చర్చకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. విపక్షాల డిమాండ్ మేరకు ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు ఒక్కో సభలో మొత్తంగా 16 గంటల సమయం కేటాయించారు. తిరిగొచ్చిన తర్వాత.. 28న దిగువ సభలో, మరుసటిరోజు ఎగువసభలో చర్చ ప్రారంభం కానుంది. చర్చకు మోదీ సమాధానం ఇస్తారా, లేదా అనేది ఇంకా తేలకపోయినా.. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని విదేశాలకూ మరోసారి స్పష్టం చేసేలా ఆయన మాట్లాడే అవకాశం ఉందని భాజపా సీనియర్ నేత ఒకరు వెల్లడిరచారు.