పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
` చర్చకు విపక్షాల పట్టు.. కొనసాగిన వాయిదాల పర్వం
` ఉభయసభలు నేటికి వాయిదా
` పార్లమెంట్ భవనం ఎదుట విపక్ష ఎంపీల నిరసన
న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండోరోజూ ఎలాంటి చర్చ లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. బీహార్ లో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో ఓటర్ల జాబితాను సవరిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. లోక్‌సభలో, రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.పరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దఢ్ ఖర్ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత మరుసటి రోజు పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ రాజీనామాపై కాంగ్రెస్ నేతలు, బీజేపీ ఎంపీలపై ఆరోపణలు గుప్పించారు. సోమవారం పార్లమెంట్‌లో జరిగిన సీన్ మళ్లీ రెండో రోజు రిపీట్ అయింది. వాయిదా తీర్మానాలపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. అయితే స్పీకర్, చైర్మన్ సభలను వాయిదా వేస్తూ వచ్చారు. సభలో బయట సభ్యులు నిరసనకు దిగడంతో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.అంతకు ముందు రెండో రోజు లోక్ సభ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడిరది. రైతు సమస్యలపై చర్చించాలని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అయితే విపక్షాలు అదే అంశంపై పట్టుపడ్డటంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ ఓం బిర్లా లోక్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలో కూడా అదే పరిస్థితి నెలకొనడంతో సమావేశాలను గంట పాటు వాయిదా వేశారు. దీంతో రెండో ఉభయసభలు వాయిదా పడ్డాయి. వాయిదా తర్వాత ప్రారంభమైన పార్లమెంట్ ఉభయసభలు. సమావేశాల్లో భాగంగా రాజ్యసభ, లోక్ సభలో మళ్లీ విపక్ష సభ్యుల నినాదాలతో దద్దరిల్లడంతో రాజ్యసభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు. బీహార్ ఓటర్ల జాబితా అత్యవసర సవరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని విపక్ష ఎంపీల డిమాండ్ చేశారు. దీంతో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడిరది. ఇక లోక్ సభలో కూడా ఇదే తంతు కొనసాగుతోంది.
పార్లమెంట్ భవన్ ముందు విపక్ష ఎంపీల నిరసన
పార్లమెంట్ భవనం ముందు విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. బీహార్ ఓటర్ల అత్యవసర సవరణ జాబితా నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడిన తర్వాత వెలుపలికి వచ్చిన ఇండియా కూటమి సభ్యులు, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు విపక్షాల ఎంపీలు ప్లకార్లులు పట్టుకొని నిరసన చేపట్టారు. రైతు సమస్యలపై చర్చతో పాటు వాయిదా తీర్మానాలపై చర్చించాలని నినాదాలు చేశారు.