రాహుల్ బాటలోకి మోదీని తీసుకొచ్చాం
` కులగణన చేసి రికార్డు నెలకొల్పాం
` 88 కోట్ల పేజీల్లో కులగణన సర్వే డేటా నిక్షిప్తమైంది
` దేశానికి దిశ చూపేలా తెలంగాణ కులగణన
` రాహుల్ హావిూ మేరకు పకడ్బందీగా సర్వే
` రాహుల్ డిమాండ్‌తో దిగొచ్చిన కేంద్రం
` జనగణనతో పాటు కులగణనకు సర్కార్ నిర్ణయం
` బీసీ కోటా ఆమోదించేలా కేంద్రంపై పోరాటం
` తెలంగాణ కులగణనపై సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్
` మోడీ ఒరిజినల్ బీసి కాదు…కన్వర్టెడ్ అంటూ సంచలన వ్యాఖ్యలు
న్యూఢల్లీి(జనంసాక్షి):స్వాతంత్యర్ర వచ్చిన తర్వాత దేశంలో ఇప్పటివరకు కులగణన జరగలేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాహుల్ లక్ష్యం మేరకు తెలంగాణలో సమగ్ర కులగణనను చేపట్టామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారని గుర్తుచేశారు. రాహుల్ ఒత్తిడితోనేకేంద్రం దిగివచ్చిన జనగణనతో పాటు, కులగణనకు అంగీకరించిందని అన్నారు. రాహుల్ ఇచ్చిన హావిూ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేసిందని చెప్పారు. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేపై దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలు, నేతలకు సీఎం రేవంత్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలో కులగణన సర్వే పక్రియను 2024లో మేం ప్రారంభించాం. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, కుల, రాజకీయ సర్వే సమగ్రంగా జరిగింది. ఇది 88 కోట్ల పేజీల్లో నిక్షిప్తమైంది. ప్రధాని మోదీకి బీసీలపై నిజమైన ప్రేమ లేదు. కొన్ని విషయాల్లో మోదీ సర్కార్ దిగివచ్చేలా రాహుల్‌గాంధీ పోరాటం చేశారు. ఆయన పోరాడినందువల్లే మూడు రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కులగణన చేసేందుకు కూడా దిగి వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ బీసీ కాదని.. ఆయన కన్వర్టెడ్ ఓబీసీ అంటూ కామెంట్స్ చేశారు. కన్వర్టెడ్ అయిన మోడీ బీసీల కోసం ఏం చేయరని విమర్శించారు. బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ కుల గణనకు వ్యతిరేకమని ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ హావిూ ఇచ్చారని.. ఆయన మాట ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన సర్వే విజయవంతంగా నిర్వహించామన్నారు. రాహుల్ గాంధీ మాటే తమకు లక్ష్మణ రేఖ అని స్పష్టం చేశారు. దేశానికి ఒక దిశను చూపించేలా కులగణన సర్వే చేశామని.. తద్వారా కుల గణనపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. మొదటి నుంచి క్యాస్ట్ సెన్సస్‌కు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని తెలంగాణలో విజయవంతంగా కుల గణన పూర్తి చేసి మన దారిలోకి తీసుకొచ్చామని చెప్పారు. చివరకు జనగణనలో కుల గణన చేసేలా ప్రధాని మోడీ అంగీకరించక తప్పని పరిస్థితి తెచ్చామన్నారు. మొత్తానికి మోడీని రాహుల్ గాంధీ రూట్లోకి తీసుకురాగలిగామని.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త జనగణనలో కుల గణన చేయాలని నిర్ణయించడం రాహుల్ గాంధీ సక్సెస్ అని అన్నారు. తెలంగాణ మోడల్ ను వివిధ రాష్టాల్ల్రో ఎంపీలు చెప్పాలనదే మా ఆలోచన అని.. అందుకోసమే ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్ అన్నారు. కులగణన కేవలం సర్వేనే కాదని.. ఇది సొసైటి మెగా హెల్త్ చెకప్ అని అభివర్ణించారు. కుల గణన సర్వే ఆధారంగా తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామని.. ఇందుకు ఉద్దేశించిన మూడు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లుల ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని విూరే ఒప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్లో విూరు కొట్లాడండి.. బయట జంతర్ మంతర్ దగ్గర మేం కొట్లాడుతామన్నారు. కులగణనపై సోనియా గాంధీ ఇచ్చిన లేఖ నాకు సర్వస్వమని అన్నారు. కుల గణన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వివరాలు ఇవ్వలేదని.. వారి ముగ్గురిని తెలంగాణ జనభా నుంచి తీసేశామన్నారు. అంతకుముందు తెలంగాణ డిప్యూటీ- సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే ఇవాళ దేశానికి దిక్సూచిగా మారిందని అన్నారు. రాహుల్ గాంధీ హావిూ మేరకు రాష్ట్రం అధికారంలోకి రాగానే కులగణన చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా విభజించి సమగ్రమైన సర్వే నిర్వహించినట్లు- వివరించారు. కాంగ్రెస్ ఒత్తిడితో దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు కేంద్రం దిగి వచ్చిందని తెలిపారు.అంతకుముందు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే ఇవాళ దేశానికి దిక్సూచిగా మారిందని అన్నారు. రాహుల్ గాంధీ హామీ మేరకు రాష్ట్రం అధికారంలోకి రాగానే కులగణన చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా విభజించి సమగ్రమైన సర్వే నిర్వహించినట్లు వివరించారు. కాంగ్రెస్ ఒత్తిడితో దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు కేంద్రం దిగి వచ్చిందని తెలిపారు.